Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: పక్కలో ప్రియుడు, కోడుకు మూడ్ పాడు చేస్తున్నాడని ? సుఖం కోసం, సినిమా స్కెచ్ !

అహమ్మదాబాద్/చెన్నై: భర్తతో కాపురం చేసిన భార్య కొడకుకు జన్మనిచ్చింది. భర్త ఉదయం ఉద్యోగానికి వెళ్లిన తరువాత భార్య ఇంట్లోనే ఉంటున్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం రూమ్ దగ్గర ఉద్యోగం చేస్తున్న యువకుడిని సెట్ చేసుకున్న భార్య అతనితో ఎంజాయ్ చేసింది. ఉదయం భర్త ఉద్యోగానికి వెళ్లడంతో అతని భార్య ప్రియుడితో మజా చేసే ఉద్యోగం మొదలు పెట్టింది. ప్రతిసారి కొడుకును వెంట పెట్టుకుని వెళ్లడం, ప్రియుడితో మంచి మూడ్ లో ఉన్న సమయంలో కొడుకు ఏడవడం ఆ తల్లికి నచ్చలేదు. నీ కొడుకు ఏంది ఎప్పుడు మంచి టైమ్ లో మనం సుఖంగా ఉంటున్న సమయంలో మూడ్ పాడు చేస్తున్నాడని ప్రియుడు అసహనం వ్యక్తం చేశాడు.

ప్రియుడు సంతోషంగా ఉండాలంటే నా కొడుకును చంపేయాలని కసాయి తల్లి ప్లాన్ వేసింది. కొడుకును హత్య చేస్తే తాను కాని, తన ప్రియుడు కాని పోలీసులకు చిక్కకూడదని ఆలోచించింది. కొడుకు అనారోగ్యానికి గురైనాడని ఆసుపత్రికి పిలిచుకుని వెళ్లిన తల్లి ప్రియుడితో కలిసి ఆసుపత్రి రెస్ట్ రూమ్ లో కొడుక్కి విషయం కలిపిన పాలు, బిస్కెట్లు ఇచ్చింది. కొన్ని గంటల తరువాత కొడుకు ప్రాణాలు గాలిలో కలిసిపోయియి. చేసిన పాపం ఊరికేపోదు అనే సామెతలాగా పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడటంతో కొడుకును చంపిన తల్లి, ఆమె ప్రియుడు ఇప్పుడు కటకటాలపాలైనారు.

 బ్యాంగిల్స్ షోరూమ్ లో భర్త ఉద్యోగం

బ్యాంగిల్స్ షోరూమ్ లో భర్త ఉద్యోగం

గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని నరోదా రోడ్డులోని రతిలాల్పీ చాలి ప్రాంతంలో అజయ్ పార్మార్ నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జ్యోతి పార్మార్ అనే యువతిని అజయ్ వివాహం చేసుకున్నాడు. అజయ్, జ్యోతి దంపతులకు యూవి (3) అనే కొడుకు ఉన్నాడు. మూడు సంవత్సరాల కొడుకును బాగా చూసుకోవాలని ప్రతినిత్యం భర్త అజయ్ అతని భార్య జ్యోతికి చెప్పేవాడు. భార్య, బిడ్డను పోషించడానికి అహమ్మదాబాద్ లోని ఓ ప్రముఖ బ్యాంగిల్స్ షోరూమ్ లో అజయ్ ఉద్యోగం చేస్తున్నాడు.

 ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

ప్రియుడిని సెట్ చేసుకున్న భార్య

భర్త అజయ్ ఉదయం ఉద్యోగానికి వెళ్లిన తరువాత అతని భార్య జ్యోతి ఇంట్లోనే ఉంటున్నది. పాలన్పార్ సివిల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం రూమ్ దగ్గర ఉద్యోగం చేస్తున్న పాలన్ పూర్ నివాసి భూపేంద్ర పార్మర్ అలియాస్ భరత్ అనే వ్యక్తిని సెట్ చేసుకున్న జ్యోతి అతనితో ఎంజాయ్ చేసింది. ఉదయం భర్త అజయ్ ఉద్యోగానికి వెళ్లడంతో అతని భార్య జ్యోతి ఆమె ప్రియుడు భూపేంద్రతో మజా చేసింది.

 కొడుకును ఎత్తుకుని బయటకు వెలుతున్న కిలాడి

కొడుకును ఎత్తుకుని బయటకు వెలుతున్న కిలాడి

అజయ్ తల్లిదండ్రులు అతనితో పాటు నివాసం ఉంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి ప్రియుడు భూపేంద్రతో ఎంజాయ్ చెయ్యాలంటే భర్త అజయ్ తల్లిదండ్రులకు ఏదోఒకటి చెప్పి జ్యోతి బయటకు వెలుతోంది. కిలాడి భార్య జ్యోతి అక్రమ సంబంధం గురించి ఆమె భర్త అజయ్ కు ఏమాత్రం తెలీలేదు. భర్త అజయ్, ఆమె కుటుంబ సభ్యులకు విషయం లీక్ కాకుండా జ్యోతి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది.

 మంచి మూడ్ లో కొడుకు అడ్డం వస్తున్నాడని ?

మంచి మూడ్ లో కొడుకు అడ్డం వస్తున్నాడని ?

ప్రతిసారి కొడుకు యూవిని వెంట పెట్టుకుని వెళ్లడం, ప్రియుడు భూపేంద్రతో మంచి మూడ్ లో ఉన్న సమయంలో కొడుకు ఏడవడం జ్యోతికి నచ్చలేదు. నీ కొడుకు ఏంది ఎప్పుడు మంచి టైమ్ లో మన మూడ్ పాడు చేస్తున్నాడని ప్రియుడు భూపేంద్ర అతని ప్రియురాలు జ్యోతి దగ్గర అసహనం వ్యక్తం చేస్తూ వచ్చాడు.

 కొడుకును చంపడానికి కన్నతల్లి స్కెచ్

కొడుకును చంపడానికి కన్నతల్లి స్కెచ్

తన ప్రియుడు భూపేంద్ర సంతోషంగా ఉండాలంటే నా కొడుకు యూవిని చంపేయాలని కసాయి తల్లి జ్యోతి ప్లాన్ వేసింది. కొడుకును హత్య చేస్తే తాను కాని, తన ప్రియుడు భూపేంద్ర కాని పోలీసులకు చిక్కకూడదని జ్యోతి ఆలోచించింది. కొడుకు అనారోగ్యానికి గురైన సమయంలో చంపేస్తే పీడపోతుందని జ్యోతి, ఆమె ప్రియుడు భూపేంద్ర స్కెచ్ వేశారు.

 జ్వరంగా ఉందని ఆసుపత్రికి

జ్వరంగా ఉందని ఆసుపత్రికి

ఆగస్టు 6వ తేదీన తన కొడుకు యూవికి జ్వరం వస్తోందని, ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని వస్తానని జ్యోతి ఆమె అత్తమామలకు చెప్పింది. నేరుగా కొడుకును తీసుకుని ప్రియుడు భూపేంద్ర పని చేస్తున్న సివిల్ ఆసుపత్రిలోకి వెళ్లింది. కొడుకు అనారోగ్యానికి గురైనాడని ఆసుపత్రికి పిలిచుకుని వెళ్లిన జ్యోతి ఆమె ప్రియుడు భూపేంద్రతో కలిసి ఆసుపత్రి రెస్ట్ రూమ్ లో కొడుక్కి విషయం కలిపిన పాలు, బిస్కెట్లు ఇచ్చింది.

 ఇంటికి వెళ్లి డ్రామాలు ఆడిన కసాయి తల్లి

ఇంటికి వెళ్లి డ్రామాలు ఆడిన కసాయి తల్లి

విషం కలిపిన పాలు, బిస్కెట్లు తిన్న యూవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. నేరుగా ఇంటికి వెళ్లిన జ్యోతి తన కొడుకు నిద్రపోతున్నాడని బెడ్ మీద పడుకోబెట్టింది. కొంత సేపటి తరువాత అజయ్ తండ్రి పరిశీలించగా యూవీకి శరీరం కాలిపోతుందని గమనించి వెంటనే బాలుడిని అహమ్మదాబాద్ లోని శారదా బెన్ ఆసుపత్రిలో ఐసీయూలో చేర్పించారు. చికిత్స విఫలమై ఆగస్టు 8వ తేదీన చిన్నారి యూవీ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 భార్య, ప్రియుడు అందర్

భార్య, ప్రియుడు అందర్

పోస్టుమార్టం నివేదికలో యూవీకి విషం కలిపిన పాలు, బిస్కెట్లు తినిపించారని, అందుకే బాలుడి ప్రాణాలు పోయాయని వెలుగు చూసింది. తన కోడలు జ్యోతినే మా మనుమడు యూవీని హత్య చేసి ఉంటుందని ఆమె అత్తమామలు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇవ్వడంతో జ్యోతి నేనే నా కొడుకును ప్రియుడు భూపేంద్రతో కలిసి హత్య చేశానని అంగీకరించింది. ప్రియుడి సుఖం కోసం కొడుకును హత్య చేసిన జ్యోతి, ఆమె ప్రియుడు భూపేంద్రను అరెస్టు చేశామని అహమ్మదాబాద్ సీనియర్ పోలీసు అధికారి కేబీ శంక్లా మీడియాకు చెప్పారు. ప్రియుడి కోసం కన్న కొడుకును జ్యోతి హత్య చేసిన విషయం వెలుగు చూడటం అహమ్మదాబాద్ లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+