అమానవీయ ఘటన: 22ఏళ్లుగా చీకటిగదిలో బంధీగా మహిళ; అసలేం జరిగిందంటే!!
గుజరాత్లోని సూరత్లో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను కుటుంబ సభ్యులు 22 సంవత్సరాలుగా ఒక చీకటి గదిలో బంధించి ఉంచిన ఘటన వెలుగులోకి రావడంతో బందీగా ఉన్న మహిళను బయటకు తీసుకు రావడం కోసం ఒక ఎన్జీవో రంగంలోకి దిగింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆమెను గది నుండి బయటకు తీసుకురావడానికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఎన్జీవో సభ్యుల ప్రయత్నంతో,పోలీసుల సహకారంతో మహిళకు చీకటి గది నుండి విముక్తి లభించింది.

మానసిక స్థితి సరిగా లేదని గదిలో బంధీగా మహిళ
అసలు విషయానికి వస్తే సూరత్ లోని ఉదానాకు చెందిన మహిళకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆ మహిళ ను కుటుంబ సభ్యులు గత 22 సంవత్సరాలుగా ఇంట్లోనే బంధించి ఉంచారు. ఆమె మానసిక స్థితి సరిగా లేని కారణంగా ఆమెను చీకటి గదిలో బంధించి ఉంచినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెను బయటకు వదిలితే అందరి పై దాడి చేస్తుందని, తమను చిత్రహింసలకు గురి చేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

కర్మ ఫలాలను అనుభవిస్తుందని చెప్పిన భర్త
అయితే సదరు మహిళను గది నుండి బయటకు తీసుకురావడానికి గంగాబా చారిటబుల్ ట్రస్ట్ అనే ఎన్జీవో బాగా ప్రయత్నాలు చేసింది. చివరకు సదరు మహిళను చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గది నుండి బయటకు తీసుకు వచ్చారు. మొదట బాధితురాలిని బయటకు విడుదల చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఎన్జీవో సభ్యులు వెల్లడించారు. ఆమెను గదిలోనే ఉంచాలని, బాధితురాలు తన కర్మ ఫలాలను అనుభవిస్తుంది అని భర్త చెప్పారని వారు పేర్కొన్నారు.

హింసించేది అంటూ కుమారుల ఆరోపణ; పోలీసుల సాయంతో మహిళకు విముక్తి
ఇక పిల్లలు సైతం తల్లి పట్ల చాలా విముఖతను ప్రదర్శించారని ఎన్జీవో సభ్యులు చెబుతున్నారు. అమ్మ తమను బాగా హింసించేదని, ఆ సమయంలో తమను ఎవరూ ఆదుకోలేదని పిల్లలు చెబుతున్నారు. మీరు బలవంతంగా అమ్మను బయటకు తీసుకువెళ్లినా మీ పైన కూడా అమ్మ దాడి చేస్తుందని బాధితురాలి పిల్లలు ఎన్జీవో సభ్యులను హెచ్చరించారు. చివరకు పోలీసుల సహాయంతో మహిళను బయటకు తీసుకు వచ్చిన ఎన్జీవో సభ్యులు ఆమెను మానసిక వైద్యశాలలో వైద్యం నిమిత్తం చేర్పిస్తామని కుటుంబసభ్యులకు చెప్పి, సదరు మహిళకు చీకటి గది నుండి విముక్తి కలిగించారు.

ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలి.. కానీ అమానవీయంగా ప్రవర్తించరాదు
మానసిక పరిస్థితి బాగోలేదని, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని గదిలో పెట్టి బంధిస్తే రోగం నయం కాకపోగా పిచ్చి మరింత ముదిరే ప్రమాదం ఉంటుంది. కనుక మానసిక అనారోగ్యంతో బాధపడే వారిని గదిలో ఉంచి బాధించకుండా ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయిస్తే కొంత మేరకు వారు తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. మనుషుల్ని గదిలో బంధించి అమానవీయంగా ప్రవర్తించకుండా, వారి సమస్యకు తగిన పరిష్కారాన్ని వెతికి తదనుగుణంగా చర్య తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications