విలాసాల కోసం అండాలు అమ్ముకుంటున్న వివాహిత.. బయటకు చెబితే చంపేస్తానంటూ భర్తకు బెదిరింపు..

గుజరాత్‌లోని అమ్రైవాడి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఒక విచిత్రమైన సంఘటన సంఘటన చోటుచేసుకుంది. విలాసాలకు అలవాటుపడిన ఓ వివాహిత తన అండాలను అమ్ముకుంది. దీనిపై భర్త ప్రశ్నించగా చంపేస్తానంటూ బెదిరింపులకు దిగింది. నిందితురాలు అనితకు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి తర్వాత ఆమె అత్తమామలతో తరచూ గొడవపడుతుండేది.

వేరు కాపురం

వేరు కాపురం

అంతేకాకుకుండా వేరు కాపురం పెడతామని భర్తపై ఒత్తడి చేస్తూ ఉండేది. దీంతో అతను అనిత ఒత్తిడి భరించలేకు ఇల్లు అద్దెకు తీసుకుని వేరు కాపురం పెట్టింది. ఆమె ఖర్చులు ఎక్కువ చేయడంతో పాటు భర్త సంపదన సరిపోక.. రోజూ భర్తను వేధిస్తూ ఉండేది. ఈ వేధింపులు తట్టుకోలేని భర్తి 2019లో తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. దీంతో అనిత తన భార్తపై అమ్రైవాడిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేసింది.

2 సంవత్సరాలు

2 సంవత్సరాలు

2 సంవత్సరాల తర్వాత పెద్దలు వారిద్దరికి నచ్చజెప్పారు. దీంతో భర్త అనిత వద్దకు వచ్చాడు. అనిత తన తెలికుండా రెండు మూడు రోజులు కనబడకుండా పోవడం.. ఆమె చేసే ఖర్చులు చూసి భర్తకు అనుమానం వచ్చింది. అనితకు ఇంత డబ్బు ఎక్కడిదని విచారణ చేయగా.. ఆమె అండాలను అమ్ముకుంటున్నట్లు భర్తకు తెలిసింది.

అహ్మదాబాద్‌

అహ్మదాబాద్‌


అహ్మదాబాద్‌లోని వివిధ ఆసుపత్రులలో పరిచయాలు ఉన్న ఏజెంట్ ద్వారా అతని భార్య తన గుడ్లను విక్రయిస్తోందని అతను గుర్తించాడు. దీనిపై అనితను ప్రశ్నించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని అనిత భర్తను బెదిరించింది. దీంతో అతను వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అండాలు అమ్ముకోవడంల అనితకు తన తల్లి కూడా సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

నకలీ పత్రాలు

నకలీ పత్రాలు

2019 జనవరి నుంచి 2022 జూన్‌ మధ్య పలుమార్లు అనిత తన అండాలను విక్రయించుకుందని భర్త తెలిపారు. అంతే కాకుండా అండాల అమ్మకానికి తన భర్త అనుమతి ఉందంటూ ఆమె నకలీ పత్రాలను సృష్టించిందని చెప్పారు.
నిందితురాలు అనిత తన పుట్టిన తేదీని మార్చుకుని నకిలీ ఆధార్ కార్డును సంపాదించి గుడ్లు విక్రయించినట్లు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+