వీడు మాములు దొంగ కాదు, నైటీల పెట్టుబడి, సీసీటీవీల్లో మాయాజాలం, వైరల్ వీడియోలతో షాక్ !

నైటీ వేసుకున్న వ్యక్తి ఇంటి ముందు ఖరీదైన బూట్లను దొంగిలిస్తున్న దృశ్యం బెంగళూరులోని సీసీటీవీ కెమెరాల్లో చిక్కింది. మహిళలు ఉపయోగించే నైటీ వేసుకున్న దొంగ మెల్లగా కాంపౌండ్ గేటు దూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. అనంతరం ఇంటి ముందు చెప్పుల స్టాండ్ లో ఉంచిన షూలను దొంగిలించి వచ్చినంత వేగంగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యం ఇంటి ముందు అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.

ఈ సీసీటీవీ ఫుటేజీని అనిల్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేసి బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేశాడు. బెంగుళూరు పోలీసులు కూడా దీనిపై స్పందించి ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సంబంధించిన ఖచ్చితమైన ప్రదేశాన్ని (లోకేషన్) పంపాలని అనిల్ కుమార్ ను అభ్యర్థించారు. దొంగ చేతివాటం ప్రదర్శించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 A young man is committing thefts in Bengaluru wearing nighties

37 సెకన్లు, మరో వీడియో 27 సెకన్ల నిడివి గల రెండు వీడియోలు ట్విట్టర్ లో పోస్ట్ చేయబడ్డాయి,

మొదటి వీడియోలో దొంగ అతని తలపై గుడ్డ కట్టుకుని తరువాత శరీరం మీద నైటీ ధరించి ఇంటి కాంపౌండ్ దిగి లోపల ఉన్న షూలు చోరీ చేసి తరువాత అంతే వేగంగా రోడ్డుపైకి దూకి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చాలా సేపటికి రోడ్డు మీదు నడిచి వెళ్లాడు. తరువాత మరో పక్క ఇంటి కాంపౌండ్‌ లోకి ఆ దొంగ వెళుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే మరో వీడియోలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలను గమనించిన ఈ దొంగ భవనం మెట్లు ఎక్కి తలపై గుడ్డతో ముఖాన్ని కప్పి భుజానికి ఏదో ఒక బ్యాగ్ నిండా వేలాడదీయడం కనిపించింది.

అయితే ఈ ఘటన బెంగళూరులోని ఏ ప్రాంతంలో జరిగిందన్న ప్రస్తావన మాత్రం కచ్చితంగా లేదని, వీడియో పోస్టు చేసిన వ్యక్తి ఆ ప్రాంతం లోకేషన్ వివరాలు ఇవ్వలేదని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ పోస్ట్‌పై బెంగళూరు నగర పోలీసులు స్పందిస్తూ ఈ సంఘటన జరిగిన ప్రాంతం వివరాలను తెలియజేయమని వీడియో పోస్ట్ చేసిన అనిల్‌ను కోరామని అన్నారు. నైటీ వేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఈ దొంగ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+