ఐటీ హబ్ లో నైట్ డ్యూటీ, సూర్యుడు పుట్టాడు, ఇంటి ముందుకు వచ్చాడు, నరికేశారు
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ఉద్యోగాలు చెయ్యడానికి దేశ విదేశాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తుంటారు, ఐటీ బీటీ కంపెనీలు, కార్పోరేట్ కంపెనీలు, ఫ్యాక్టరీలు, చిన్నచిన్న షాపులు, మాల్స్ లో పని చేసే వాళ్లు ఉన్నారు. ప్రతిరోజు 24 గంటలు పని చేసే కంపెనీలు, ఫ్యాక్టరీలు, కార్పోరేట్ సంస్థలు బెంగళూరులో వందలు, వేల సంఖ్యలో ఉన్నాయి. నైట్ డ్యూటీ ముగించుకుని వేకువ జామున చాలా మంది ఉద్యోగులు ఇళ్లకు వెలుతున్నారు.
బెంగళూరులో ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని ఇష్టానుసారంగా నరికి చంపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరు నగరంలోని పులకేశీనగర్‌లోని కాక్స్‌టౌన్ సమీపంలో ఈ హత్య జరిగింది. 35 ఏళ్ల వయసు ఉన్న అజీత్ అనే వ్యక్తి బుధవారం ఉదయం 7 గంటలకు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ హత్య జరిగింది.

హఠాత్తుగా వచ్చిన హంతకులు అజీత్ ను అతని ఇంటి గుమ్మం ముందే అడ్డుకుని అతని మీద దాడి చేసి నరికేశారు. తరువాత అజిత్ తల మీద బండరాయి వేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న అజిత్‌ను కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించే సమయానికి మార్గం మధ్యలో అజిత్ మృతి చెందాడని వైద్యులు చెప్పారు.
హత్య జరిగిన పులకేశీనగర ప్రదేశంలో నివాసం ఉంటున్న ప్రజలు హడలిపోయారు. ఉదయం పూట అతి దారుణ హత్య జరగడంతో దానిని చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కాక్స్ టౌన్ సమీపంలోని ఐటీసీ ఫ్యాక్టరీలో అజిత్ పనిచేస్తున్నాడని తెలిసింది. ఆర్థికపరమైన కారణాలతో, అక్రమ సంబందం విషయంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అజిత్ ను పదునైన ఆయుధాలతో నరికి చంపి పరారయ్యారని, హంతకుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అజిత్ ను అతని ఇంటి ముందే హత్య చేయడంతో స్థానిక ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.












Click it and Unblock the Notifications