ఫ్రెండ్స్ అందరికి భార్యలు ఉన్నారు, పెళ్లి కాలేదని ఓ యువకుడు ఏం చేశాడంటే?
చిన్నప్పటి నుంచి కలసిమెలసి తిరిగన స్నేహితులు పెళ్లి వయసుకు వచ్చారు. కొంత మంది యువకులు వారి కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిలను పెళ్లి చేసుకుని హ్యాపీగా సంసారం చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఫ్రెండ్స్ లో అందరికి పెళ్లి అయినా కూడా ఓ యువకుడికి మాత్రం పెళ్లి కాలేదు.
పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని విజయనగరంలో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కుడ్లిగి తాలూకాలోని గుడేకోటే గ్రామంలో పెళ్లి చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు అయినా అమ్మాయి దొరకలేదని ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం, అతని జీవితాంతం కలసి జీవితాన్ని గడపడానికి సామాజిక పరంగా, మతపరమైన గుర్తింపు పొందడానికి వివాహం చేసుకుంటాడు. వివిధ సంస్కృతులలో వివిధ రకాలుగా వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మతాలకు సంబంధించి, వివిద కులాలకు సంబంధించి వివిధ రకాలుగా వివాహ సంప్రదాయాలు ఉన్నాయి.
వివిధ వర్గాల విశ్వాసాలు మరియు ఆచారాల ఆధారంగా వివాహాలు జరుగుతాయి. అయితే అందరికి పెళ్లి అయిపోయినా తనకు మాత్రం పెళ్లి కాలేదనే ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. విజయనగర జిల్లాలోని గుడేకోటే గ్రామానికి చెందిన మధుసూదన్ (26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
మదుసూధన్ అలియాస్ మధు అనే యువకుడు తిక్కతిక్కగా ప్రవర్తించడంతో అతనికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి యువతుల కుటుంబ సభ్యుు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా మధుకు పెళ్లి జరగలేదు. తనకు పెళ్లి కాలేదని మధు మద్యం సేవించడానికి బానిస అయ్యాడు, ఇటీవల ఓ అమ్మాయి మధును పెళ్లి చేసుకుంటానని అంగీకరించినా చివరికి ఆ పెళ్లికూడా క్యాన్సిల్ అయ్యింది.
ఎవ్వరు కూడా అమ్మాయిని ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో మధు ఇంకా విపరీతంగా మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. చివరికి పెళ్లి కాలేదని ఆవేదనతో మధు విషం సేవించాడు. మధు విషం తాగిన విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ చికిత్స ఫలించక మధు మృతి చెందాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications