Bhagwant Mann:ఢిల్లీలోని పంజాబ్ సీఎం నివాసంలో సోదాలు..!
Bhagwant Mann: ఢిల్లీలోని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రిని అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీ తప్పులను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అయితే అలాంటి చర్య ఏదీ జరగలేదని ఢిల్లీ పోలీసులు ఈ వాదనలను పూర్తిగా ఖండించారు.
"ఢిల్లీలోని భగవంత్ మాన్ నివాసంలో సోదాలు నిర్వహించడానికి పోలీసులు వచ్చారు. కానీ బీజేపీ వ్యక్తులు బహిరంగంగా డబ్బులు, బూట్లు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నా.. పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి నివాసంలో రైడ్ చేయడానికి వచ్చారు."అని ఢిల్లీ సీఎం ఆతిషి పోస్ట్ చేశారు.

పోలీసుల మోహరింపులపై ఆప్ నేతలు కూడా బీజేపీని విమర్శిస్తున్నారు. ఫిబ్రవరి 5న జరగననున్న అసెంబ్లీ ఎన్నికల రోజున ఢిల్లీ ప్రజలు అలాంటి చర్యలకు సమాధానం చెప్తారని హెచ్చరించారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తాము పంజాబ్ ముఖ్యమంత్రి నివాసంలో ఎలాంటి సోదాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. సీ-విజల్ పోర్టల్ లో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తుపై రిటర్నింగ్ అధికారి నేతృత్వంలోని పోలీస్ టీమ్ ముఖ్యమంత్రి నివాసానికి రావాల్సి వచ్చిన ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. కానీ అక్కడి భద్రతా సిబ్బంది పోలీసుల బృందాన్ని అనుమతించలేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications