గుజరాత్ ఉపఎన్నికలో బీజేపీకి అనూహ్య షాక్-ఆప్ అభ్యర్ధి ఇటాలియా సంచలనం..!
గుజరాత్ లో దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విసవాదరా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి అనూహ్య షాక్ తగిలింది. ఆప్ నిలబెట్టిన మాజీ పోలీసు అధికారి గోపాల్ ఇటాలియా బీజేపీ అభ్యర్ధి కిరీట్ పటేల్ పై సంచలన విజయం సాధించారు. ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఆప్ అభ్యర్ధి ఇటాలియా ఏకంగా 17554 ఓట్ల తేడాతో ఘన విజయం అందుకున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి గెలిచిన భూపేంద్ర భయానీ 2023 డిసెంబర్ లో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార బీజేపీలో చేరిపోయారు. దీంతో పాటు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయడంతో అప్పటి నుంచీ ఈ సీటు ఖాళీగా ఉంది. ఈ సీటుకు తాజాగా నిర్వహించిన ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. అధికార బీజేపీ కూడా ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుని కిరీట్ పటేల్ ను రంగంలోకి దించింది. అయితే జనం మాత్రం ఆప్ ను మోసం చేసి బీజేపీలో చేరిన భూపేంద్ర వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ ప్రభావం ఉప ఎన్నికలపై పడింది. దీంతో ఆప్ నిలబెట్టిన మాజీ పోలీసు అధికారి ఇటాలియా గెలుపొందారు.

బోటాడ్ కు చెందిన గోపాల్ ఇటాలియా పోలీసు అధికారిగా కెరీర్ ప్రారంభించి అనంతరం సామాజిక కార్యకర్తగా మారారు. 2017లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ మద్యపాన నిషేధం ఉల్లంఘనలపై సీఎం నితిన్ పటేల్ కు ఫిర్యాదు చేసి సంచలనం రేపారు. సీఎంకు ఆయన చేసిన వీడియో కాల్ వైరల్ కావడంతో ఆయన అవినీతి వ్యతిరేక పోరాటానికి బీజాలు పడ్డాయి. రాజకీయాల్లోకి రాక ముందు పటీదార్ రిజర్వేషన్ల పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు. 2020లో ఆప్ లో చేరిన ఇటాలియా రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఆప్ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. గతంలో పేపర్ లీక్ ఆందోళనలు, రైతుల తరఫున పోరాటాలు చేసిన ఇటాలియాను వారే ఇప్పుడు గెలిపించారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications