కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే: మాఫియా ముప్పు

ఎవరినో ఎమ్మెల్యేలుగానే, పార్లమెంటు సభ్యులుగానో చేసేందుకు ఎఎపి పుట్టుకు రాలేదన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈ పార్టీ ఏర్పాటయిందని గుర్తు చేసారు. విద్యుత్, తాగునీటికి సంబంధించిన హామీలను పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎఎపి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. కేజ్రీవాల్ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటిగా ఉందన్నారు. హామీల అమలును కేజ్రీవాల్ పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. హామీల అమలులో ఆయన వెనుకడుగు వేస్తున్నారని, మేనిఫెస్టోలో అమలు కాని హామీలు ఉన్నాయన్నారు. డెన్మార్క్ మహిళ అత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని నిలదీశారు.
కేజ్రీవాల్‌కు మాఫియా ముప్పు
మరోవైపు కేజ్రీవాల్‌కు టెండర్, వాటర్ మాఫియా నుండి ముప్పు ఉందని అంటున్నారు. ఆయన భద్రత నిరాకరిస్తున్నప్పటికీ పోలీసులు ఇంటివద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, కేజ్రీవాల్‌కు పోలీసులు కల్పిస్తున్న భద్రతను స్వీకరించేలా ఆదేశించాలంటూ న్యాయవాది అనూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌ను కొట్టి వేస్తూ... ముఖ్యమంత్రికి రక్షణ కల్పించాలని కోరడానికి పిటిషనర్ ఎవరని ప్రశ్నించింది. దీనిపై అతనికి ఉన్న ఆసక్తి ఏమిటని ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications