'టాయ్ లెట్ లో రెండున్నర కిలోల బంగారం'
గోవా : ఓ ఎయిర్ ఇండియా విమానం టాయ్ లెట్ లో 2.5 కిలోల బంగారం దొరకడంతో కస్టమ్స్ అధికారులు షాకయ్యారు. దుబాయ్ నుంచి గోవా వచ్చిన ఎయిర్ ఇండియా విమానం టాయ్ లెట్ లో 2.5 కేజీల బంగారం దొరికింది.
70లక్షల విలువ చేసే ఈ బంగారాన్ని టాయ్ లెట్ లో ఎవరు దాచిపెట్టారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై ఆరా తీసేందుకు ఎయిర్ ఇండియాలో ప్రయాణించిన ప్రయాణికుల జాబితాను పరిశీలిస్తున్నారు అధికారులు. అధికారుల తనిఖీ అనంతరం.. విమానం గోవా నుంచి బెంగుళూరు బయలుదేరి వెళ్లింది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో బంగారం దొరకడం.. ఏడాదిలో మూడోసారి అని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.













Click it and Unblock the Notifications