యాసిడ్ దాడికి గురైన యువతి రష్యా వెళ్లింది: సుష్మా
న్యూఢిల్లీ: ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం వారణాసిలో యాసిడ్ దాడికి గురైన రష్యా యువతి ఆమె స్వదేశానికి వెళ్లి పోయారని వీదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. రష్యాలో ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం భారత్ భరిస్తుందని అన్నారు.
ఇప్పటికే భాదితురాలు దార్య యురీవా (23) కు వైద్య ఖర్చలు భరిస్తామని తాము హామి ఇచ్చామని, వైద్యం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రూ. ఐదు లక్షలు ప్రకటించిందని గుర్తు చేశారు. దార్య యురీవా తల్లిని రష్యాలోని భారత రాయభారీ కలిసి చర్చించారని చెప్పారు.

బాధితురాలు దార్య యురీవా త్వరగా కొలుకోవాలని సుష్మా స్వరాజ్ దేవుడిని ప్రార్థించారు. వారణాసిలోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్ లో దార్య యురీవా బసచేశారు. ఆ పేయింగ్ గెస్ట్ యజమాని మనుమడు సిద్దార్థ శ్రీవాత్సవ ఈ నెల 13వ తేది శుక్రవారం యువతి మీద యాసిడ్ దాడి చేశాడు.
ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. యాసిడ్ దాడిలో యువతికి 40 శాతం గాయాలైనాయి. దార్య యురీవాకు ప్లాస్టిక్ సర్జరి చెయ్యాలని వారణాసిలోని వైద్యులు చెప్పారు. రష్యాలో ఆమెకు ప్లాస్టిక్ సర్జరి చెయ్యనున్నారు.












Click it and Unblock the Notifications