నటుడు కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక .. అభిమానులలో ఆందోళన!!
విలక్షణ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనకు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కమల్ హాసన్ ను అయన కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చెన్నై లోని పోరూరు రామచంద్ర ఆసుపత్రికి కమల్ హాసన్ ను తరలించి చికిత్స అందిస్తున్నారు.

తీవ్ర అస్వస్థతకు గురైన కమల్ హాసన్.. ఆస్పత్రిలో చేరిక
నిన్నటి నుండి తీవ్ర జ్వరంతో పాటుగా కమల్ హాసన్ శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి హుటాహుటిన ఆయనను రామచంద్ర ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. కమల్ హాసన్ ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉంటాయని, అందుకే ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు భావిస్తున్నారు. కమల్ హాసన్ త్వరగా కోలుకుని ఇంటికి రావాలని కమల్ హాసన్ అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు.

నిన్న విశ్వనాథ్ ను కలిసిన కమల్ హాసన్ .. అంతలోనే
ఇదిలా ఉంటే ఇటీవలే నటుడు కమల్ హాసన్ తన పుట్టిన రోజు వేడుకలను సినీ ప్రముఖులు, బంధుమిత్రులు, సన్నిహితులతో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం నాడు జ్వరం తోనే హైదరాబాదుకు వచ్చిన కమల్ హాసన్ కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కలిశారు. వారిద్దరూ ఉన్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరడం తో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తమ అభిమాన నాయకుడికి ఏమైందోనని అందరూ టెన్షన్ పడుతున్న పరిస్థితి ఉంది.

నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన విలక్షణత
నటుడిగానే కాకుండా నిర్మాతగానూ, దర్శకుడిగానూ కమల్ హాసన్ తన దైన శైలిలో సినీ లోకంలో అందరి మన్ననలు పొందారు. దర్శకుడిగా ఆయన అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. హాలీవుడ్ మూవీ స్టైల్ ను దేశానికి సరికొత్తగా పరిచయం చేశారు. ప్రస్తుతం తమిళంలో బిగ్ బాస్ రియాలిటీ షో ను కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. గతేడాది ఆయన విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు కమల్ హాసన్.

గతంలో కోవిడ్ బారిన పడిన కమల్ హాసన్.. ఇప్పుడు మళ్ళీ అస్వస్థత
అంతకు ముందు ఆయన కరోనా బారిన పడ్డారు. సినిమా చేస్తున్న సమయంలోనే కరోనాతో కొంతకాలం సినిమాకు బ్రేక్ పడింది. కరోనా నుండి కోలుకున్న తరువాత ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం శంకర్ తో కలిసి ఇండియన్ 2 సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మణిరత్నం తో కలిసి మరో సినిమాకు కమల్ హాసన్ రెడీ అయ్యారు. ఇక ఈ క్రమంలో కమల్ హాసన్ అస్వస్థతకు గురి కావడం సినీ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications