వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూవుల్లో ఉగ్రవాదులు ఉన్నారు, ఎవరికి లాభం: కమల్ హాసన్ వ్యాఖ్యలు, ప్రజల ఎదురుదాడి !

హిందూవుల్లో ఉగ్రవాదులు ఉన్నారని చెప్పిన హీరోఎవరికీ లాభం లేదంటూ కమల్ హాసన్, వివాదాస్పద వ్యాఖ్యలుహీరో మీద ఎదరుదాడికి దిగిన ప్రజలు, రాజకీయాల్లోకి వస్తావా, ఏం మాట్లాడుతున్నావ్ ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో ఉగ్రవాదులు ఉన్నారని, వారితో చాల ప్రమాదం ఉందనే అర్థంలో కమల్ హాసన్ వ్యాఖ్యలు చెయ్యడంతో పలువురు పౌరులు ఆయన మీద సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

హిందూవుల్లో ఉగ్రవాదులు ఉన్నారని, వారు విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉందని, దాని వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని కమల్ హాసన్ అన్నారు. హిందూవులను కించరిచే విధంగా హీరో కమల్ హాసన్ వ్యాఖ్యలు చేశారని ఆయన తీరును సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు.

హిందూవుల్లో పుట్టి ఇలా అంటావా !

హిందూవుల్లో పుట్టి ఇలా అంటావా !

గతంలో హిందూవులు ఉగ్రవాదం వైపు చూడలేదని, విధ్వంసాలు సృష్టించలేదని, సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకునే వారని, అయితే ఇప్పుడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని, ఇది ఎవరికి లాభం అంటూ కమల్ హాసన్ ప్రశ్నించారు. హిందూవుగా పుట్టిన కమల్ హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి రెచ్చగొడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

జీర్ణించుకోలేకపోతున్నారు

జీర్ణించుకోలేకపోతున్నారు

కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడానికి సిద్దం అవుతున్న సమయంలో నవంబర్ 7వ తేదీన ఆయన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అభిమానులు సిద్దం అవుతున్న సందర్బంలో హీరో హిందూవుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం పలువురు పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు.

నాలుగు రోజుల్లోనే !

గత శనివారం కమల్ హాసన్ ఉత్తర చెన్నై, ఎగ్మూరు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలు, మత్య్సకారులతో భేటీ అయ్యి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ స్థావరాల కారణంగా పడుతున్న బూడిద, రసాయనాల కంపెనీల వలన వస్తున్న కాలుష్యం, చెత్త చెదారం కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన మీడియాకు చెప్పారు.

హిందూవులు టార్గెట్ !

హిందూవులు టార్గెట్ !

ప్రతినిత్యం ఏదో ఒక విధంగా తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేసే కమల్ హాసన్ ఈ సారి హిందూవులను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చెయ్యడంతో సోషల్ మీడియాలో ఆయన మీద ఎదురుదాడికి దిగారు. కమల్ హాసన్ మతిపోయి మాట్లాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

కేరళలో రెడ్ టెర్రరిజం

కేరళలో అధికారంలో ఉన్న ఎల్ డీఎఫ్ లోని వామపక్ష పార్టీల కార్యకర్తల రెడ్ టెర్రరిజం, మత విధ్వేశాలు రెచ్చగొడుతున్న జకీర్ నాయక్, పీఎఫ్ ఐల గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదని, మొదట వాటిని మూసివేయాలని చెప్పాలని కమల్ హాసన్ కు సూచిస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో కమల్ హాసన్ మీద ఎదురుదాడి మొదలైయ్యింది.

English summary
Kamal Haasan has hit out at the right-wing saying they cannot challenge anyone saying there are Hindu terrorists, because there are!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X