మోడీ ప్రభుత్వం తర్వాత టార్గెట్ వాళ్లే: రెండు మూడు లక్షల మందిపై వేటు?
బ్లాక్ మనీ నిర్మూలనను మోడీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల 2.09 లక్షల డొల్ల కంపెనీల గుర్తింపును రద్దు చేసింది. తాజాగా వాటి వెనక ఉన్న వాస్తవ లబ్ధిదారులను గుర్తించే పనిలో ఉంది.
న్యూఢిల్లీ: బ్లాక్ మనీ నిర్మూలనను మోడీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల 2.09 లక్షల డొల్ల కంపెనీల గుర్తింపును రద్దు చేసింది. తాజాగా వాటి వెనక ఉన్న వాస్తవ లబ్ధిదారులను గుర్తించే పనిలో ఉంది.

2.09 లక్షల కంపెనీలకు షాక్
దీంతో పాటు మరిన్ని డొల్ల కంపెనీలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఏళ్లుగా వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉన్న 2.09 లక్షల కంపెనీల గుర్తింపును ఇటీవల ఆర్థిక శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే.

వారికి జైలు శిక్ష
ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలను నిలిపేసింది. సదరు బ్యాంకు ఖాతాల నుంచి గుర్తింపు రద్దైన కంపెనీల డైరెక్టర్లు సొమ్మును డ్రా చేస్తే కనీసం ఆరు నెలల నుంచి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని చెప్పింది.

ఏ పదవిలో ఉన్నా అనర్హత
ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష భేటీలో నిర్ణయాలు తీసుకున్నారు. గుర్తింపు రద్దైన డైరెక్టర్లు మూడేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు రిటర్నులు దాఖలు చేయకపోతే ఒకవేళ ఇతర కంపెనీలో ఏ పదవిలో ఉన్నా అనర్హత వేటు పడుతుంది.

అనర్హత వేటు
దీంతో పాటు మళ్లీ పునర్నియామకం అయ్యే అవకాశాలు కూడా రద్దవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ చర్యల వల్ల కనీసం రెండు నుంచి మూడు లక్షల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

వాస్తవ లబ్ధిదారులను గుర్తించే చర్య
డొల్ల కంపెనీల వెనుక ఉన్న వాస్తవ లబ్ధిదారులను గుర్తించే చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఆయా కంపెనీల వెనుక ఉన్న వ్యక్తులు, వారి పాత్రకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు వివరాలు సేకరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications