Aditya L1: అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానం: హీలియం విండ్‌పై విశ్లేషణ

ISRO: సూర్యుడిపై సరికొత్త అధ్యయనాలను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1 (Aditya L1) తన పని మరింత ముమ్మరం చేసింది. ఇదివరకే భూ కక్ష్యను దాటుకున్న ఈ శాటిలైట్ ఆదిత్యుడి వైపు దూసుకెళ్తోంది. తన గమ్యస్థానానికి చేరువ అవుతోంది.

ప్రయోగించిన తేదీ నుంచి ఆదిత్య ఎల్1 శాటిలైట్ 125 రోజుల్లో నిర్దేశిత గమ్య స్థానం లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పాయింట్‌కు అతి సమీపంలో ఉందీ శాటిలైట్. ఇంకొద్ది రోజుల్లో తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో సూర్యుడిపై అధ్యయనాలను మొదలు పెడుతుంది.

Aditya-L1 Mission: Solar Wind Ion Spectrometer payload was activated by the ISRO

నిర్దేశిత గమ్యానికి చేరుకోవడానికి ముందే- తన పని ఆరంభించింది. ఈ శాటిలైట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపించిన పేలోడ్స్ ఒక్కటొక్కటిగా యాక్టివేట్ అవుతున్నాయి. ఇస్రో పంపించిన ప్రధాన పేలోడ్ హై- ఎనర్జీ ఎల్ 1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రో మీటర్ (HEL1OS). ఇది 10- 150 కేవీ వైడ్ రేంజ్ ఎక్స్-రే ఎనర్జీ బ్యాండ్‌లో పనిచేస్తుంది.

ఇప్పుడు తాజాగా మరో రెండు పేలోడ్స్- సోలార్ విండ్ అయాన్ స్పెక్టోమీటర్, సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పర్టికల్ స్పెక్టోమీటర్.. యాక్టివేట్ అయ్యాయి. ఈ రెండు కూడా ఆదిత్య సోలార్ విండ్ పర్టికల్ ఎక్స్‌పెరిమెంట్‌లో ఓ భాగం. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పర్టికల్ స్పెక్టోమీటర్, నవంబర్ 2వ తేదీ నుంచి సోలార్ విండ్ అయాన్ స్పెక్టోమీటర్‌‌ పని చేస్తోన్నాయని ఇస్రో తెలిపింది.

సోలార్ విండ్ అయాన్ స్పెక్టోమీటర్‌‌‌లో అమర్చిన రెండు సెన్సర్లు కూడా.. 360 డిగ్రీల్లో రొటేట్ అవుతాయి. తాజాగా సోలార్ విండ్ అయాన్స్, ప్రైమర్లీ ప్రొటాన్స్, ఆల్ఫా పర్టికల్స్‌ను సంగ్రహించాయి. వాటిని విశ్లేషించినట్లు ఇస్రో తెలిపింది. హిస్టోగ్రాం ప్రోటాన్ (H+), ఆల్ఫా పర్టికల్, డబుల్ అయోనైజ్డ్ హీలియం (He2+)లో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లు గుర్తించామని వివరించింది.

సౌర పవన లక్షణాలు, అందులో చోటు చేసుకునే అంతర్లీన ప్రక్రియలు.. భూమిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే విషయంపై సమగ్రంగా అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటు చేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్‌‌పై ముందుగానే ఒక అవగాహన ఏర్పడిందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+