Aditya-L1 : చంద్రుడు, భూమితో ఆదిత్య ఎల్ 1 మిషన్ సెల్ఫీ వీడియో చూశారా ?
భూమిపై సూర్యుడి ప్రభావం, సౌర తుఫాన్లతో పాటు ఎన్నో నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 అంతరిక్ష నౌక విజయవంతంగా సాగిపోతోంది. ఐదు రోజులుగా విజయవంతంగా తన ప్రయాణం సాగిస్తున్న ఆదిత్య ఎల్ 1 నౌక.. ఇప్పుడు ఎల్ 1 పాయింట్ దిశగా తాను సాగిస్తున్న ప్రయాణం మధ్యలో ఓ కీలక ఘట్టాన్ని షేర్ చేసింది. చంద్రుడు, భూమి ఒకే కక్ష్యలో ఉన్నప్పుడు వాటితో సెల్ఫీ తీసుకుని ఆదిత్య ఎల్ 1 పంపిన ఫొటోను ఇస్రో ఇవాళ విడుదల చేసింది.

Aditya-L1 Mission:
— ISRO (@isro) September 7, 2023
👀Onlooker!
Aditya-L1,
destined for the Sun-Earth L1 point,
takes a selfie and
images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy
ప్రతిష్టాత్మక స్పేస్‌క్రాఫ్ట్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 ఇవాళ భూమిని తీసిన చిత్రాలను పంపింది. ఈ చిత్రాల్ని భూమికి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న తన గమ్యస్థానమైన లాగ్రాంజియన్ పాయింట్ ఎల్ 1కి వెళుతున్నప్పుడు క్లిక్ చేసింది. ఆదిత్య-ఎల్1 క్లిక్ చేసిన సెల్ఫీతో పాటు ఈ చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ట్విట్టర్‌లో షేర్ చేసింది. సూర్యుడు-భూమి మధ్య ఎల్ 1పాయింట్ ను చేరేందుకు ఉద్దేశించిన ఆదిత్య-L1 భూమి, చంద్రుని సెల్ఫీ, చిత్రాలను తీసుకుంటుందని అని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం తెలిపింది.
సెప్టెంబరు 4న కెమెరా ఆన్-బోర్డ్ ఆదిత్య-L1 ద్వారా తీసిన ఈ చిత్రాలు VELC (విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, SUIT (సోలార్ అతినీలలోహిత ఇమేజర్) పరికరాలను చూపుతున్నాయి. సెప్టెంబర్ 2న ఏపీలోని శ్రీహరికోట నుంచి ఈ మిషన్ బయలుదేరింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఇప్పటికే రెండు భూమి-బౌండ్ ఆర్బిటల్ యుక్తుల్ని పూర్తి చేసింది. అలాగే లాగ్రాంజ్ పాయింట్ ఎల్ 1 వైపు బదిలీ కక్ష్యలో ఉంచడానికి ముందు మరో రెండు పని చేస్తుంది. ఆదిత్య-ఎల్1 125 రోజుల తర్వాత ఎల్1 పాయింట్ వద్ద అనుకున్న కక్ష్యకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications