మోడీకి అద్వానీ ప్రశంస, ఏపీ, తెలంగాణలపై అమిత్ షా

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ప్రధాని నరేంద్ర మోడీ పైన శనివారం ప్రశంసలు కురిపించారు. దేశం మోడీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీ ఘన విజయం తర్వాత పార్టీ నుండి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారన్నారు.

వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు నేతలు, కార్యకర్తలు కష్టపడాలన్నారు. మంత్రులు ఎలా పని చేస్తున్నారన్న దాని ఆధారంగా పార్టీ పని తీరును అంచనా వేయరని, ప్రజలతో కార్యకర్తలు ఎలా వ్యవహరిస్తున్నారన్న దాని ఆధారంగానే అంచనా వేస్తారన్నారు.

Advani praises Narendra Modi

పార్టీ పగ్గాలను అమిత్ షాకు అప్పగించిన రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో పార్టీ సాధించిన ఘన విజయాన్ని అమిత్ రానున్న కాలంలో మరింత పటిష్ఠం చేసి ఫలితాలు చూపించగలరని చెప్పారు.

ఆంధ్రా, తెలంగాణలో బలోపేతం చేస్తాం: అమిత్ షా

ఆంధ్ర, తెలంగాణలో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేస్తామని అమిత్ షా ప్రకటించారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పార్టీని విస్తరిస్తామన్నారు. ప్రభుత్వంలోని ఎవరోఒక మంత్రి ప్రతిరోజూ రెండుగంటల సేపుపార్టీ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటారని చెబుతూ తమ సమస్యలను తెలియజేయటానికి కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా పార్టీ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలను తెలియచేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+