Wife; భార్యను చంపేసి అంబులెన్స్ కు ఫోన్ చేసిన భర్త, ఇంటికే ప్రియుడిని పిలిపిస్తోందని తెలిసి ?

చెన్నై/నెల్లూరు: వివాహం చేసుకున్న దంపతులకు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం చెయ్యడానికి భర్త అతని భార్య, పిల్లలతో కలిసి పొరుగు రాష్ట్రానికి వెళ్లాడు. దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త రాత్రి 2 గంటల వరకు పని చేసి తరువాత ఇంటికి వెలుతున్నాడు. ఉదయం బయటకు వెలుతున్న భర్త అర్దరాత్రి దాటిన తరువాతే ఇంటికి వెలుతున్నాడు. పగలు భార్య మాత్రమే ఇంటిలో ఉంటున్నది. ఇటీవల భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త ఆమె మీద నిఘా వేశాడు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. రాత్రి నిద్రపోయిన నా భార్య ఉదయం నిద్రలేవలేదని, ఆమెకు ఏదో అయ్యిందని భర్త అంబులెన్స్ కు షోన్ చేశాడు. భార్యను ఆసుపత్రికి పిలుచుకుని వెళితే అప్పటికే ఆమె ప్రాణం పోయింది. తరువాత అసలు కథ మొదలైయ్యింది.

నెల్లూరులో పెళ్లి

నెల్లూరులో పెళ్లి

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన మోహమ్మద్ హుస్సేన్ అలియాస్ మోహమ్మద్ (29) అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం రెజీనా (26) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. మోహమ్మద్, రెజీనా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నెల్లూరు టూ కన్యాకుమారి

నెల్లూరు టూ కన్యాకుమారి

ఆరు సంవత్సరాల క్రితం మోహమ్మద్ ఉద్యోగం చెయ్యడానికి తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోవిల్ పట్టాణం చేరుకున్నాడు. ఉద్యోగం చెయ్యడానికి మోహమ్మద్ అతని భార్య రెజినా, పిల్లలతో కలిసి నాగర్ కోవిల్ చేరుకుని పున్నై నగర్ లో అద్దె ఇల్లు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు.

హోటల్ లో పరోటా మాస్టర్

హోటల్ లో పరోటా మాస్టర్


నాగర్ కోవిల్ లోని ఓ డాబాలో మోహమ్మద్ పరోటా మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. డాబాలో ఉదయం బయటకు వెలుతున్న మోహమ్మద్ అర్దరాత్రి దాటిన తరువాతే ఇంటికి వెలుతున్నాడు. అర్దరాత్రి 2 గంటల వరకు మోహమ్మద్ డాబాలోనే ఉంటున్నాడు. భర్త మోహమ్మద్ బయటు వెళ్లిన తరువాత అతని భార్య రెజీనా ఆమె పిల్లలతో కలిసి ఇంటిలోనే ఉంటున్నది.

 భర్తను బెదిరించిన భార్య

భర్తను బెదిరించిన భార్య

కొంతకాలంగా ఇంట్లో ఉంటున్న రెజీనా తీరులో మార్పు వచ్చిందని ఆమె భర్త మోహమ్మద్ అనుమానం పెంచుకున్నాడు. రెజీనా మీద ఆమె భర్త మోహమ్మద్ నిఘా వేశాడు. ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటున్న నా భార్య రెజీనా ఎంజాయ్ చేస్తోందని మోహమ్మద్ రగిలిపోయాడు. రాత్రి 3 గంట సమయంలో ఇంటికి వెళ్లిన మోహమ్మద్ అతని భార్యతో గొడవ పెట్టుకున్నారు. ఆ సందర్బంలో నేను ఆత్మహత్య చేసుకుంటానని రెజీనా ఆమె మెడకు టవల్ బిగించి భర్త మోహమ్మద్ ను బెదిరించింది.

భార్యను చంపేసి పిల్లలతో ఆడుకున్న భర్త

భార్యను చంపేసి పిల్లలతో ఆడుకున్న భర్త


రెజినా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో రగిలిపోయిన మోహమ్మద్ నిజంగానే ఆమె మెడకు ఉన్న టవల్ బిగించి భార్యను చంపేశాడు. నిద్రలేచిన పిల్లలతో మోహమ్మద్ ఆడుకున్నాడు. అమ్మ ఎందుకు నిద్రేవలేదని పిల్లలు అడగడంతో అమ్మకు జ్వరం వచ్చి నిద్రపోతున్నదని చెప్పిన మోహమ్మద్ వారితో చాలాసేపు ఆడుకున్నాడు.

అంబులెన్స్ కు ఫోన్ చేసి డ్రామాలు ఆడిన భర్త

అంబులెన్స్ కు ఫోన్ చేసి డ్రామాలు ఆడిన భర్త

రాత్రి నిద్రపోయిన నా భార్య రెజినా ఉదయం నిద్రలేవలేదని, ఆమెకు ఏదో అయ్యిందని మోహమ్మద్ అంబులెన్స్ కు షోన్ చేశాడు. భార్య రెజీనాను అంబులెన్స్ లో ఆసుపత్రికి పిలుచుకుని వెళితే అప్పటికే ఆమె ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పారు. పోలీసులకు అనుమానం వచ్చి మోహమ్మద్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు కథ వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+