మహిళా జర్నలిస్టుల్ని అందుకే అడ్డుకున్నాం..! తేల్చేసిన తాలిబాన్ మంత్రి..!

ఐక్యరాజ్యసమితి అనుమతితో భారత్ లో తొలిసారి పర్యటిస్తున్న తాలిబాన్ కీలక నేత, ఆప్ఘనిస్తాన్ విదేశాంగమంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ తాజాగా రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో జర్నలిస్టులు అందరినీ ఆహ్వానిస్తారని భావించినా మహిళల్ని మాత్రం రానివ్వలేదు. ఇప్పటికే తాలిబాన్లు అంంటే మహిళల్ని చిన్నచూపు చూస్తారని, వారి స్వేచ్ఛ, హక్కుల్ని హరిస్తారనే పేరుంది. దీంతో ఈ వ్యవహారం భారత్ లో వివాదాస్పదమైంది. దీనిపై స్పందించిన కేంద్రం ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో తాలిబాన్ మంత్రి స్వయంగా స్పందించారు.

రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఆప్ఘనిస్తాన్ ఎంబసీలో నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో మహిళా జర్నలిస్టులు రానివ్వకుండా అడ్డుకున్న ఘటనపై తాలిబాన్ మంత్రి ముత్తాకీ స్పందించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ విషయానికొస్తే, ఇది స్వల్ప నోటీసులో జరిగిందన్నారు. ఎంపిక చేసిన జర్నలిస్టులను మాత్రమే అనుమతించినట్లు ఆయన పేర్కొన్నారు. అనుమతించే జర్నలిస్టుల జాబితా చాలా నిర్దిష్టంగా ఉందన్నారు.

Afghan FM Says Excluding Women Journalists Was a Technical Issue not deliberate

మహిళా జర్నలిస్టుల్ని అనుమతించకపోవడం మరింత సాంకేతిక సమస్య అని, తమ సహోద్యోగులు జర్నలిస్టుల నిర్దిష్ట జాబితాకు ఆహ్వానం పంపాలని నిర్ణయించుకున్నారని, ఇది తప్ప వేరే ఉద్దేశ్యం లేదని తాలిబాన్ మంత్రి ముత్తాకీ తేల్చిచెప్పేశారు. దీంతో ఆప్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వ విధానాల ఆధారంగా వారి రాయబార కార్యాలయం కూడా పురుష జర్నలిస్టుల్ని మాత్రమే ఎంపిక చేసి మంత్రి ప్రెస్ మీట్ కు పిలిచినట్లు తేలిపోయింది.

Afghan FM Says Excluding Women Journalists Was a Technical Issue not deliberate

వాస్తవానికి రాయబార కార్యాలయాల్లోకి ఎవరిని అనుమతించాలి, ఎవరిని ఆపాలన్న దానిపై నిర్దిష్టమైన నిబంధనలే ఉన్నాయి. ఇవి ఆయా దేశాల విధానాల ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఈ విషయంలో కేంద్రం ప్రమేయం కూడా ఉండదు. దీంతో కేంద్రం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకునే పరిస్ధితి లేకుండా పోతోంది. అయితే కనీసం ఈ విషయంలో నిరసన వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండటంపై కేంద్రంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+