Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీకి ఉపఎన్నికల షాక్-పెట్రో ఊరట, ఉచిత రేషన్ కొనసాగింపు సహా దిద్దుబాటు-యూపీపై ఫోకస్

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తప్పలేదు. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోలు, డీజిల్ ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి కారణమైన బీజేపీకి గుణపాఠం చెప్పాలని భావించిన ఓటర్లు.. హుజురాబాద్ వంటి కొన్ని చోట్ల మినహా చాలా సీట్లలో ఓటమి రుచి చూపించారు. దీంతో మేలుకున్న కాషాయ దళం ఇప్పుడు యూపీ ఎన్నికల్లో ఈ ఫలితాలు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతోంది. అందులో భాగంగానే పెట్రోల్ ధరల తగ్గింపుతో పాటు పలు చర్యలు చేపడుతోంది.

 బీజేపీకి ఉపఎన్నికల షాక్

బీజేపీకి ఉపఎన్నికల షాక్

దేశంలోని పలు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఉపఎన్నికలు కేంద్రంలోని బీజేపీకి భారీ షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో నాలుగు సీట్లను తృణమూల్ కాంగ్రెస్ కు కోల్పోవడం, హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో సైతం పరాజయాలు ఎదురుకావడం బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ఉపఎన్నికలపై అంతర్మథనం చెందుతున్న బీజేపీ ఇందుకు గల కారణాలను విశ్లేషించే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్టాల ఎన్నికల్లో భారీఎదురుదెబ్బలు తప్పవని కాషాయ నేతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్దదైన యూపీలో అధికారం కోల్పోతే ఇక కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడం కూడా కష్టమైపోతుందనే వాదన వినిపిస్తోంది.

యూపీ అసెంబ్లీ పోరుపై ఫోకస్

యూపీ అసెంబ్లీ పోరుపై ఫోకస్

దేశమంతా గెలవడం ఓ ఎత్తు, యూపీని గెలవడం ఓ ఎత్తనే విషయం బీజేపీకి బాగా తెలుసు. గతంలో యూపీని గెలిచేందుకు బీజేపీ ఎన్ని కష్టాలు పడిందో కూడా తెలుసు. అందుకే ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ మళ్లీ గెలిచి తీరాలని కాషాయ సేన భావిస్తోంది. కానీ ఇప్పుడు యోగీ ఆదిత్యనాథ్ పాలనలో ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. దీంతో అక్కడ బీజేపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది. దీని ప్రభావం వచ్చే ఎన్నికలపై కచ్చితంగా పడేలా ఉంది. ముఖ్యంగా లఖీంపూర్ వంటి ఘటనలు బీజేపీకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లపై ప్రభావం చూపే అంశాలపై బీజేపీ దృష్టిపెడుతోంది.

బీజేపీ దిద్దుబాటు చర్యలు

బీజేపీ దిద్దుబాటు చర్యలు

ఉపఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలతో కేంద్రంలోని బీజేపీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత స్పష్టమైపోయింది. ఇక దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మరిన్ని షాకులు తప్పేలా లేవు. దీంతో ఎన్డీయే సర్కార్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగానే ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు, ఉపఎన్నికల్లో ఓటర్ల ఆగ్రహానికి కారణమైన అంశాలపై దృష్టిసారించింది. అందుకే ఇప్పడు వాటిపై ప్రజలకు ఊరటనిచ్చేలా వరుస నిర్ణయాలు తీసుకుంటోంది.

పెట్రో ఊరట, యూపీలో ఉచిత రేషన్ కొనసాగింపు

పెట్రో ఊరట, యూపీలో ఉచిత రేషన్ కొనసాగింపు

ప్రస్తుతం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పెట్రో ధరలే. చమురు కోసం లీటరుకు వంద రూపాయలకు పైగా వెచ్చించి వాహనాలు నడిపే పరిస్ధితుల్లో దేశంలో సగటు మధ్యతరగతి జీవులు లేరు. దీంతో చమురు ధరలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా ఎక్సైజ్ సుంకాన్ని దీపావళి కానుక పేరుతో తగ్గించింది. దీంతో పెట్రో ధరలు కొంతమేర తగ్గాయి. అదే సమయంలో రాష్ట్రాల్ని కూడా వ్యాట్ తగ్గించాలని కోరింది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు వెంటనే తగ్గించేశాయి. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా బీజేపీ మాత్రం సామాన్యుడికి కొంత ఊరటనిచ్చానే ఫీలింగ్ తెచ్చుకుంది. ఆ వెంటనే యూపీలో యోగీ సర్కార్ కేంద్రం ఇచ్చిన ఉచిత రేషన్ ను హోలీ వరకూ తాము కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో దాదాపు 15 కోట్ల మందికి ప్రయోజనం కలగబోతోంది. అదే సమయంలో త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లోనూ పెట్రో ధరల తగ్గింపుతో విపక్షాల అజెండా నుంచి ఓ అంశాన్ని బీజేపీ లాగేసినట్లయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+