సయీద్‌తో పోలిక: షారుక్‌‌పై బీజేపీ ఎంపీ సంచలనం

ముంబై: మత అసహనంపై షారుక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఎదురుదాడి మరింతగా పెరిగింది. తొలుత సాధ్వీ ప్రాచి షారూక్‌ను తప్పుబట్టగా, ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పుడు తాజాగా బీజేపీ ఎంపీ యోగి ఆదిత్య నాథ్ షారుక్‌పై ఘాటు విమర్శలు చేశారు. షారుక్ ఖాన్‌ను ఏకంగా పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌తో పోల్చి చెప్పారు. వారిద్దరి భాష ఒకటేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

After One BJP Leader Retracts Tweets, Another Compares Shah Rukh Khan With Hafiz Saeed

'షారుక్ ఖాన్‌ భాషకు హఫీజ్ సయీద్ భాషకు పెద్దగా తేడా ఏమిలేదు. మనం షారుక్ సినిమాలను బ్యాన్ చేయాలని, చూడటం ఆపేయాలని అనుకున్న ప్రతిసారి ముస్లింల మాదిరిగానే సయీద్ కూడా రోడ్లపైకి వస్తాడు' అని ఆదిత్యనాథ్ అన్నారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆ వ్యాఖ్యలు అతడి వ్యక్తిగతమని, పార్టీ ఆ మాటలతో ఏకీభవించబోదని బీజేపీ అధికార ప్రతినిథి నలిన్ కోహ్లీ వివరణ ఇచ్చారు.

కాగా, మంగళవారం "షారూక్ ఖాన్ ఇండియాలో ఉంటాడు. ఆయన మనసు మాత్రం పాకిస్థాన్ లో ఉంటుంది. ఆయన సినిమాలు ఇక్కడ కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయి. అయినా, ఆయన భారత్ లో అసహనాన్ని వెతుకుతున్నారు" అని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్‌వర్గియా ట్వీట్ చేశారు.

దీంతో కైలాశ్ విజయ్‌వర్గియా వ్యాఖ్యలపై మరో బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. దీంతో షారుక్‌పై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకున్నారని, అందుకే ఆ ట్వీట్లను తొలగిస్తున్నానని బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వార్గియా తెలిపారు.

విజయ్‌వార్గియా టిట్టర్‌లో చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ ఇటీవల పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చిన బీజేపీ అధినాయకత్వం ఆయన వ్యాఖ్యలకు దూరం జరిగింది. ఈ నేపథ్యంలో షారుఖ్‌పై తన ట్వీట్లను వెనుకకు తీసుకుంటున్నట్టు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వార్గియా తెలిపారు. ఎవరినీ గాయపర్చడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు షారూక్‌కు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ నేత డిరెక్ ఓ బ్రియన్ ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ స్పందిస్తూ బాధ్యతరహితంగా చేసే ఇలాంటి వ్యాఖ్యలు దేశ ఐకమత్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.

మరోవైపు సమాజ్ వాదీ పార్టీ నేతలు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానం అనుమతి లేకుండా ఒక్కరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయబోరని ఇదంతా బీజేపీ వ్యూహాత్మక దాడి అని ఆ పార్టీ నేత గౌరవ భాటియా అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+