అగ్నివీరుల నియామకాలకు అగ్నిపథ్ స్కీమ్2022 షెడ్యూల్ విడుదల.. జులై నుండి రిజిస్ట్రేషన్లు.. గెట్ రెడీ!!

అగ్నిపథ్ పథకం జూన్ 14, 2022న ప్రారంభించబడినప్పటి నుండి దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. దేశంలోని రక్షణ మరియు సాయుధ దళాలలో యువతను భాగస్వామ్యం చేసేందుకు ఈ పథకాన్ని కొనసాగించడానికి నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. అయితే నాలుగేళ్ల పాటు మాత్రమే ఈ ఉద్యోగానికి భరోసా ఉంటుందని చేసిన ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం అగ్నిపథ్ పథకంపై నిరుద్యోగ యువతలో ఉన్న అపోహలను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే కొనసాగుతున్న ఆందోళన మధ్య అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2022 తేదీలు మరియు పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.

అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటన

అగ్నిపథ్ స్కీమ్ లేదా 'అగ్నివీర్స్'లో నమోదు చేసుకున్న యువతకు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరే అవకాశం ఇవ్వబడుతుంది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రకారం, భారత సైన్యం కోసం అగ్నిపథ్ నోటిఫికేషన్ 2022 ఈరోజు జూన్ 20, 2022న విడుదల చేసింది. అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

నోటిఫికేషన్ తేదీలను ప్రకటించిన ప్రసార మంత్రిత్వ శాఖ

నోటిఫికేషన్ తేదీలను ప్రకటించిన ప్రసార మంత్రిత్వ శాఖ

ఇండియన్ ఆర్మీలో దరఖాస్తు చేసుకోవడానికి మరియు నమోదు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అగ్నివీరులు ఈరోజు, జూన్ 20, 2022న నోటిఫికేషన్ విడుదల చేసినట్టు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం పూర్తి షెడ్యూల్ పూర్తి వివరాలను ప్రకటించింది.

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2022 తేదీలు

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2022 తేదీలు

భారత సైన్యంలో రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జూన్ 20, 2022

ఇండియన్ నేవీ నోటిఫికేషన్ జూన్ 21, 2022

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ జూన్ 24, 2022

డిఫెన్స్ వెబ్ సైట్ లో త్వరలో అగ్నివీరుల నోటిఫికేషన్లు

డిఫెన్స్ వెబ్ సైట్ లో త్వరలో అగ్నివీరుల నోటిఫికేషన్లు

పీటీఐ నివేదిక ప్రకారం, భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొనప్ప విలేకరుల సమావేశంలో ఈ రోజు, జూన్ 20, 2022న సైన్యం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని తెలిపారు. వివిధ రిక్రూట్‌మెంట్ యూనిట్ల నుండి తదుపరి నోటిఫికేషన్‌లు జూలై 1 నుండి అగ్నివీర్స్ కోసం విడుదల చేయబడతాయి అని పేర్కొన్నారు.

ఆసక్తిగల అభ్యర్థులు 'అగ్నివీరులు' ప్రస్తుతం భారత సైన్యానికి నోటిఫికేషన్‌లు వెబ్ సైట్ లలో విడుదల చేయలేదని గమనించాలని సూచించారు. రక్షణ దళాల అధికారిక వెబ్‌సైట్‌లో అతి త్వరలో అగ్నివీరులందరికీ నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+