అగ్నిపథ్ పై కేంద్రం కీలక నిర్ణయం-కేంద్రబలగాల్లో 10 శాతం రిజర్వేషన్- వయోపరిమితి చిచ్చు
కేంద్రం తీసుకొస్తున్న అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఇరుకునపడుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చే నోటిఫికేషన్ లో వయో పరిమితి పెంపు కూడా ఆందోళనలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ స్కీం ద్వారా ఎంపికయ్యే జవాన్లకు భవిష్యత్తులో కేంద్ర బలగాల్లో, అస్సాం రైఫిల్స్ లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది.

అగ్నిపథ్ చిచ్చు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అగ్నిపథ్ చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా బీహార్, యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సైతం అగ్నిపథ్ పై ఆందోళనలు పెరుగుతున్నాయి. నిన్న సికింద్రాబాద్ స్టేషన్ ఘటనతో పాటు దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. దీంతో కేంద్రంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ఏఢాది ఉద్యోగాలకు వయోపరిమితి పెంచడం, తాత్కాలిక నియామకాలుగా ఇవి పేరు తెచ్చుకోవడం, ఆరోగ్య, పెన్షన్ భద్రత లేకపోవడం వంటి సమస్యలతో అగ్నిపథ్ పై ఆగ్రహం పెరుగుోతంది.

వయో పరిమితి చిచ్చు
రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్లు జరగకపోవడంతో ఈ ఏడాది ఇస్తున్న అగ్నిపథ్ నోటిఫికేషన్లో అభ్యర్ధుల వయో పరిమితిని 18 నుంచి 23 ఏళ్ల వరకూ ఇచ్చారు. వాస్తవానికి అభ్యర్ధుల గరిష్ట వయోపరిమితి 21 ఏళ్లుగానే ఉంది. కానీ ఈ ఏడాది మాత్రమే ఈ మినహాయింపు ఇచ్చారు. అసలే దేశవ్యాప్తంగా తీవ్ర డిమాండ్ ఉన్న ఈ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచడంతో రెగ్యులర్ గా పోటీ పడే వాళ్లలో ఆందోళన మొదలైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో సాగుతున్న నిరసనలకు ఇధి కూడా కీలక కారణంగా మారుతోంది.

అగ్నివీరులకు కేంద్ర బలగాల్లో 10 శాతం రిజర్వేషన్
అగ్నివీరుల ఉద్యోగ భద్రత విషయంలో నెలకొన్న సందేహాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత ఇచ్చే సర్టిఫికెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లే్ అవకాశం కల్పించగా.. ఇప్పుడు ఏకంగా కేంద్ర బలగాల్లోకి, అలాగే అస్సాం రైఫిల్స్ లోకి వెళ్లే అవకాశం కూడా కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర బలగాలతో పాటు అస్సాం పైపిల్స్ లోకి వెళ్లాలనుకునే అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఇవాళ ప్రకటించింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications