వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ ఫైల్సే కాదు- లఖీంపూర్ ఫైల్స్ కూడా తీయండి-అఖిలేష్ యాదవ్ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

యూపీలో బీజేపీతో హోరాహోరీ పోరాడి ఓడిపోయిన సమాజ్ వాదీ పార్టీ అథినేత అఖిలేష్ యాదవ్.. తొలిసారి ఓటమిపై స్పందించారు. యూపీలో తమదే నైతిక విజయమన్నారు. భవిష్యత్తులో బీజేపీ సీట్లు మరింత తగ్గుతాయని అఖిలేష్ జోస్యం చెప్పారు.

కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీయాలంటే లఖీంపూర్ ఫైల్స్ కూడా ఉండాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. యూపీలోమని సీతాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేష్.. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై స్పందించారు. లఖింపూర్ ఫైల్స్‌ కూడా తీయాల్సిందేనన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. మీ సీతాపూర్ లఖింపూర్ ఖేరీకి పొరుగు జిల్లా. కాశ్మీర్ ఫైల్స్‌పై సినిమా వస్తే, లఖింపూర్ ఖేరీ ఘటనపై కూడా సినిమా తీయవచ్చని అఖిలేష్ అన్నారు.యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన లక్నో వెలుపల పర్యటించడం ఇదే తొలిసారి.

Ahilesh yadav demands lakhimpur files too in wake of kashmir files film controversy

గతేడాది అక్టోబర్ 3న జరిగిన లఖీంపూర్ ఖేరీ ఘటనను అఖిలేష్ ప్రస్తావించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి చెందిన ఎస్‌యూవీ ధ్వంసమైన తర్వాత లఖింపూర్ ఖేరీ జిల్లాలో హింస చెలరేగింది. ఇందులో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు. ఆ తర్వాత జరిగిన హింసలో మరో ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటన మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా చోటు చేసుకుంది.

కాశ్మీర్ ఫైల్స్‌కు సంబంధించి, అఖిలేష్ కూటమి భాగస్వామి, రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి కూడా స్పందించారు. పెట్రోల్, డీజిల్‌ ధఱలు తగ్గించండి, రైతుల ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లపై పన్ను తగ్గించండి, సినిమాకు పన్ను రహితంగా ప్రకటించడంలో అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 111 సీట్లు గెల్చుకోగా.. దాని మిత్రపక్షాలు ఆర్ఎల్డీ, సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 14 సీట్లు గెల్చుకున్నాయి.

English summary
samajwadi party chief akhilesh yadav on today demands that lakhimpur files will also be shoot after kashmir files movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X