Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వచ్చే ఐదేళ్ళలో భారత్ లో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే.. వారికి షాకింగ్ హెచ్చరిక!

ప్రపంచవ్యాప్తంగా ఏఐ అన్ని రంగాలలోనూ శరవేగంగా తన సత్తాను చాటుతోంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో, విస్తరణతో ఉద్యోగాలు తగ్గిపోతాయి అనే భయం ఎప్పటినుంచో అందరిలోనూ ఉంది. అయితే తాజాగా అటువంటి ఆందోళనను ప్రముఖ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా మరోసారి ప్రస్తావించారు.

వచ్చే ఐదేళ్ళలో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే

భారతదేశంలో త్వరలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో ఆయన ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆయన వచ్చే ఐదేళ్లలో కనుమరుగయ్యే ఉద్యోగాల గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.రానున్న ఐదేళ్లలో ఐటీ సేవలు, బీపీఓలు దాదాపు కనుమరుగుకానున్నాయని ఖోస్లా అభిప్రాయం వ్యక్తం చేశారు.

AI Impact In India These are the jobs that will disappear in the next five years shocking warning

15 ఏళ్ళలో ఆ వృత్తులు కనుమరుగు

అలాగే, సుమారు 15 ఏళ్లలో నైపుణ్యఆధారిత వృత్తులు కూడా తుడిచిపెట్టుకుపోతాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ పరిణామం వల్ల విద్య, వైద్య సేవలు అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్మికుల స్థానంలో రోబోలు

వినోద్ ఖోస్లా మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపించనుందన్నారు. ఆ ప్రభావం ఎక్కువగా ఉద్యోగాల పైనే ఉంటుంది. కార్మికుల స్థానంలో రోబోలు పనిచేస్తాయని, కార్మికుల కంటే రోబోలకు ఖర్చు చేసే వ్యయం చాలా తక్కువగా ఉండటంతో ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఇక ఇదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు.

విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి

రానున్న 15 నుంచి 20 ఏళ్లలో చాలావరకు దేశంలో ప్రజలకు అందే సేవలు ఉచితం కావొచ్చు అన్నారు. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది అని పేర్కొన్నారు.మనుషులు ఉద్యోగాల కోసం చదవడం, ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టడం భవిష్యత్తులో సరైన ఆలోచన కాకపోవచ్చని ఖోస్లా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏఐ, మనుషులు కలిసి పనిచేసే కాలం వస్తుంది

పలు వృత్తులను ఏఐ మరింత మెరుగ్గా చేయగలదు. కాబట్టి.. ఏఐ, మనుషులు కలిసి పనిచేసే కాలం వస్తుందని తాను భావిస్తున్నట్టుగా తెలిపారు. ఇక భారత్ ఐటీ సేవల విషయంలో కాకుండా, ఏఐ ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా అవతరిస్తుంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+