బలవంతంగా..: శశికళకు 'షాక్', తమిళనాడుకు అసలు సీఎం లేరు

అన్నాడీఎంకే పార్టీ కేడర్ శశికళను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని ప్రముఖ జర్నలిస్టు స్వామినాథన్ గురుమూర్తి చెప్పారు.

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ కేడర్ శశికళను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని ప్రముఖ జర్నలిస్టు స్వామినాథన్ గురుమూర్తి చెప్పారు. శశికళ ఇటీవలే అన్నాడీఎంకే పార్టీ అధినేత్రిగా ఎన్నికయిన విషయం తెలిసిందే.

తరచి చూస్తుంటే అన్నాడీఎంకే ముక్కలు కావడం ఖాయంగా కనిపిస్తోందని, క్రమంగా అలా జరుగుతుందన్నారు. ఒక్కరోజులో ఈ పార్టీ ముక్కలయ్యేది కాదని, క్రమంగా మాత్రం ముక్కలు కావడం ఖాయమన్నారు.

శశికళ పార్టీ నాయకులను ఒక్కతాటి పైకి తేగలరేమో కానీ కేడర్‌ను మాత్రం ఏకతాటి పైకి తేలేరని చెప్పారు. బలవంతంగా నాయకులు అయితే అది పార్టీకి ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

 'AIADMK cadre not going to accept Sasikala'

1972లో ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి విడిపోయి ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకే పార్టీ స్థాపించారని, 1987-88లలోను అదే జరిగిందని ఆయన గుర్తు చేశారు.

నాయకున్ని బలవంతంగా రుద్దితే పార్టీ విడిపోవడం ఖాయమన్నారు. ఎందుకంటే బలవంతంగా తీసుకు వచ్చే నాయకుడిని కేడర్ అంగీకరించదని చెప్పారు. ప్రస్తుతం కేడర్, నాయకత్వానికి మధ్య కుదరడం లేదన్నారు.

మరో ఆసక్తికర కామెంట్ కూడా చేశారు. ప్రస్తుతం తమిళనాడుకు ముఖ్యమంత్రి లేరని చెప్పారు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుంటే పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం మంచిదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+