వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ మానసిక రోగి, ఏం మాట్లాడుతారో తెలీదు, ఉమా భారతి ఫైర్, సిక్కులు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మానసిక అస్వస్థతకు గురై బాధపడుతున్నారని కేంద్ర మంత్రి ఉమా భారతీ ఆరోపించారు. భోపాల్ లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఉమా భారతి రాహుల్ గాంధీ మంచి ఆసుపత్రిలో చూపించుకుంటే మంచిదని, రోగం తగ్గుతుందని సూచించారు. సిక్కులకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని ఉమా భారతీ ఆరోపించారు.

ఆర్ఎస్ఎస్ ను ముస్లీం బ్రదర్ హుడ్ గా పోల్చిన రాహుల్ గాంధీ మీద ఉమా భారతి విరుచుకుపడ్డారు. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఉమా భారతి ఆరోపించారు.

AICC president Rahul Gandhi mentally unstable says Uma Bharti

రాహుల్ గాంధీ ఎలా మాట్లాడుతారు ? ఎలా ప్రవర్థిస్తారు ? అనే విషయం పార్లమెంట్ సాక్షిగా ప్రజలు అందరూ చూశారని ఉమా భారతి గుర్తు చేశారు. లండన్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ సిక్కులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏనాడు ప్రవర్తించలేదని చెప్పడం పచ్చి అపద్దం అని ఉమా భారతి అన్నారు.

రాహుల్ గాంధీ మాటలు, ఆయన తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని ఉమా భారతి ఆరోపించారు. సిక్కులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆ పార్టీ నాయకుల మీద నమోదు అయిన కేసులు సాక్షం అని ఉమా భారతి అన్నారు.

AICC president Rahul Gandhi mentally unstable says Uma Bharti

రాహుల్ గాంధీ మానసిక అస్వస్థత నుంచి బయటకు రావాలని, ఆయనకు జ్ఞానం ఇవ్వాలని ఆదేవుడిని కోరుకుంటున్నానని ఉమా భారతి అన్నారు. భారతదేశ చరిత్ర ను మార్చడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని రాహుల్ గాంధీ లండన్ లో ఆరోపించారు.

ఈ విషయంపై ఉమాభారతి ఘాటుగా స్పంధించారు. కాంగ్రెస్ పార్టీని మోతిలాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ముందుకు నడిపించారని ఉమా భారతి చెప్పారు. ఇప్పుడు మానసిక అస్వస్థతకు గురైన రాహుల్ గాంధీ ఆ పార్టీ పగ్గాలు చేపట్టారని ఉమా భారతి ఎద్దేవ చేశారు.

English summary
AICC president Rahul Gandhi mentally unstable. He does not know what and where to speak, alleged by central minister Uma Bharti in Bhopal, Madhya Pradesh on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X