Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నాడు..భారీ స్కెచ్ వేశాడు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. థర్డ్ ఫ్రంట్ గా రంగంలోకి దిగింది అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM). మొత్తం 32 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఆయా నియోజకవర్గాల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో అయిదు చోట్ల పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా ఉన్నాయి. దశలవారీగా మిగిలిన అభ్యర్థుల పేర్లను విడుదల చేయనుంది. మొత్తం 16 జిల్లాల్లో 32 నియోజకవర్గాలతో కూడిన జాబితా ఇది.

థర్డ్ ఫ్రంట్ గా ఎన్నికల బరిలో దిగడం.. ముస్లింల ఓటుబ్యాంక్ భారీగా చీలుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇది.. రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహాకూటమిని దెబ్బ కొట్టొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో- ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే నియోజకవర్గాలు అధికంగా ఉన్నాయి. మెజారిటీ స్థానాల్లో మహాకూటమికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారి గెలుపోటములను ఎఐఎం తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.

AIMIM set to contest on 32 seats in Bihar Elections 2025 released the 1st phase candidates list

ఎంఐఎం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్, జాతీయ అధికార ప్రతినిధి ఆదిల్ హుస్సేన్.. ఈ జాబితాను విడుదల చేశారు. థర్డ్ ఫ్రంట్ గా పోటీ చేస్తామని వెల్లడించారు. త్వరలో అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. సామాజిక న్యాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలపై పార్టీ ప్రధానంగా దృష్టి సారిస్తామని, బీహార్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా అవతస్తామని తెలిపారు.

  • కిషన్‌గంజ్‌ జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు- కిషన్‌గంజ్, కొచ్చాధమన్, బహదూర్‌గంజ్, ఠాకుర్‌గంజ్. ఈ నాలుగు సీట్లల్లో కమ్రుల్ హుడా, మహ్మద్ ఇజార్ అస్ఫి, అంజార్ నయీమీ, మహబూబ్ ఆలమ్ పోటీ చేయనున్నారు
  • పూర్నియా జిల్లాలో మూడు స్థానాలు- అమౌర్, బైసి, కస్బా. ఈ మూడింట్లో అమౌర్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. ఇక్కడ అఖ్తరుల్ ఇమాన్ పోటీ చేయనున్నారు.
  • కతిహార్‌ జిల్లాలో- బలరాంపూర్, ప్రాణ్‌పూర్, మణిహరి, బరారీ, కద్వా.
  • అరారియా జిల్లాలో- జోకిహాట్, అరారియా
  • గయా జిల్లాలో- షెర్‌ఘాటి, బేలాగంజ్
  • ఈస్ట్ చంపారన్ జిల్లాలో- ఢాకా, నర్కటియా
  • దర్భంగా జిల్లా- జలే, దర్భంగా రూరల్, కేవాటి, గౌరా బౌరం
  • సికంద్రా జిల్లాలో- నవాడా సిటీ, జముయ్
  • భాగల్‌పూర్ జిల్లాలో- నాథ్‌నగర్, భాగల్‌పూర్ సివాన్
  • సమస్తిపూర్ జిల్లాలో- కల్యాణ్‌పూర్
  • సీతామర్హి జిల్లాలో- బాజ్‌పట్టి
  • మధుబని జిల్లాలో- బిస్ఫీ,
  • వైశాలి జిల్లాలో- మహువా,
  • గోపాల్‌గంజ్ జిల్లాలో గోపాల్ గంజ్.. స్థానాల్లో మజ్లిస్ పోటీ చేయనుంది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+