సింగపూర్, బ్యాంకాక్‌కు వెళ్లేవారికి ఎయిరిండియా గుడ్‌న్యూస్: ప్రత్యేక ఆఫర్లు ఇలా

న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) వినియోగదారుల కోసం పండగల వేళ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇండియా - సింగపూర్, ఇండియా - బ్యాంకాక్ రూట్లలో టికెట్ల ధరలపై ఆకర్షణీయమైన రాయితీలను అందిస్తోంది. అక్టోబర్ 18 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ అక్టోబర్ 21న ముగియనుంది. ఈ ప్రత్యేక సేల్ లో టికెట్లు బుక్ చేసుకున్న వినియోగదారులు మార్చి 2024 ముగిసేలోగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ప్రత్యేక సేల్‌లో భాగంగా ఇండియా - సింగపూర్ వెళ్లి రావడానికి ఎకానమీ టికెట్ ధరను ఎయిరిండియా రూ. 13,330గా నిర్ణయించింది. బిజినెస్ క్లాస్ అయితే.. కనీసం రూ. 70,290 చెల్లించాల్సి ఉంటుంది. ఇక, బ్యాంకాక్ వెళ్లి వచ్చేందుకు అయ్యే టికెట్ ధర రూ. 17,045 నుంచి ప్రారంభమవుతోంది. అదే బిజినెస్ క్లాస్ టికెట్ అయితే ధర రూ. 49,120గా ఉంది. అయితే, నగరాన్ని బట్టి ధరలు వేరుగా ఉంటాయి.

Air India launches special sale on India-Singapore, Bangkok routes; Details here

కావాలంటే కేవలం వెళ్లడానికి మాత్రమే టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ ఆఫర్లు వరిస్తాయి. అక్కడ కరెన్సీకి అనుగుణంగా ధరలను నిర్ణయించారు. ఈ ప్రత్యేక ఆఫర్లను ఉపయోగించుకోవడానికి ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

అంతేగాక, అధీకృత ట్రావెల్ ఏజెంట్ల వద్ద కూడా బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయని.. ముందు బుక్ చేసుకున్నవారికి ప్రయోజనం ఉంటుందని సూచించింది. అక్టోబర్ మొదట్లో యూరప్‌లోని పలు నగరాలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన ఎయిరిండియా.. తాజాగా బ్యాంకాక్, సింగపూర్‌లకు ప్రకటించింది. ఇది ఇలావుంటే, ఎయిరిండియా ఈ అక్టోబర్ 23 నుంచి కోల్‌కతా - బ్యాంకాక్ మార్గంలో రెగ్యూలర్ విమాన సర్వీసులను ప్రారంభించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+