సర్వర్లలో సాంకేతిక లోపం: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఎయిరిండియా సేవలు
Recommended Video
న్యూఢిల్లీ: దేశీయ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో మళ్లీ ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ సారి విమానాల్లో కాదు... ఎయిరిండియా సర్వర్లలో సమస్య వచ్చింది. ఒక్కసారిగా ప్రధాన సర్వర్ షట్‌డౌన్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిరిండియా సేవలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్ షట్‌డౌన్‌తో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Air India flights affected as airline's SITA server is down all over India & overseas since 3:30 am. More details awaited. #Visuals from Indira Gandhi International Airport in Delhi pic.twitter.com/Wl2hElACUU
— ANI (@ANI) April 27, 2019
ఒక ప్రధాన సర్వర్‌లో సమస్యలు తలెత్తడం ఈ ఏడాదిలో రెండో సారి కావడం విశేషం.శనివారం తెల్లవారు జామున 3:30 గంటలకు ఎయిర్‌లైన్స్‌కు చెందిన SITA సర్వర్ షట్ డౌన్ అయ్యిందని ఇది భారత్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా సమస్యలు సృష్టించిందని అధికారులు తెలిపారు. సర్వర్ల కారణంగా విమానాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిసిన ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. మే 1 నుంచి ప్రయాణాలు రద్దు చేసుకోదలచిన ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకుంటే ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయమని అధికారులు చెప్పారు. అయితే ప్రయాణానికి ఏడు రోజుల ముందు టికెట్ బుక్ అయి ఉన్న వాటికే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది ఎయిరిండియా.

ప్రస్తుతం ఎయిరిండియా సాంకేతిక నిపుణులు దీని మరమత్తుల పనిలో ఉన్నారని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి తాము చింతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది ఎయిరిండియా సంస్థ.అయితే సర్వీసులు పునఃప్రారంభంపై తమకు ఎలాంటి సమాచారం లేదని చాలామంది ప్రయాణికులు ట్విటర్ ద్వారా తెలిపారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications