Airport: దుబాయ్ నుంచి డాక్యూమెంట్ ఫైల్స్, ఎయిర్ పోర్టులో షాక్, జస్ట్ రూ. 5 కోట్ల డ్రగ్స్, దెబ్బకు !
బెంగళూరు: కరోనా వైరస్ థర్డ్ వేవ్ మహమ్మారి తాండవం చేస్తున్నా, ఒమిక్రాన్ వైరస్ భయపెడుతున్నా విదేశాల్లో తిరుగుతున్న ప్రయాణికులు, భారతదేశానికి వస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. విదేశాల నుంచి వస్తున్న వారి లగేజ్ లు కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి బయటకు పంపిస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సోదాలు చేస్తున్నా విదేశాల నుంచి డ్రగ్స్, అక్రమంగా బంగారం స్మగ్లింగ్ అవుతూనే ఉంది, దుబాయ్ నుంచి వస్తున్న వారి లగేజ్ లు క్షుణ్ణంగా పరిశీలించిన కస్టమ్స్ అధికారులకు అనుమానం మొదలైయ్యింది, పెద్ద ఎత్తున డాక్యుమెంట్ ఫైల్స్ దుబాయ్ నుంచి రావడంతో వాటిని అధికారులు పరిశీలించి బిత్తరపోయారు. దుబాయ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన డాక్యుమెంట్ ఫైల్స్ తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతే డాక్యూమెంట్ ఫైల్స్ లో ఏకంగా రూ. 5. 30 కోట్ల విలువైన డ్రగ్స్ ఉండటంతో అధికారులు, పోలీసులు హడలిపోయారు. డాక్యూమెంట్ ఫేల్స్ తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తికి అనుమాన వచ్చి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బెంగళూరులోని డ్రగ్స్ డీలర్స్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కరోనా అంటే లెక్కలేదు
కరోనా వైరస్ థర్డ్ వేవ్ మహమ్మారి తాండవం చేస్తున్నా, ఒమిక్రాన్ వైరస్ భయపెడుతున్నా విదేశాల్లో తిరుగుతున్న ప్రయాణికులు, భారతదేశానికి వస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా వైరస్ ను ఏమాత్రం లెక్క చెయ్యకుండా ఏదో టీస్టాల్ కు వెళ్లి టీ తాగి వచ్చేసినట్లు కొందరు పదేపదే విదేశాల్లో తిరిగేస్తూ కరోనా వైరస్ వ్యాధి వ్యాపించడానికి కారణం అవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

కస్టమ్స్ అధికారులకే టోపీ ?
విదేశాల నుంచి వస్తున్న వారి లగేజ్ లు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్లను బయటకు పంపిస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, సోదాలు చేస్తున్నా విదేశాల నుంచి బెంగళూరుకు డ్రగ్స్, అక్రమంగా బంగారం స్మగ్లింగ్ అవుతూనే ఉండటం, వాటిని అధికారులు పట్టుకోవడం జరుగుతోంది,

దుబాయ్ టూ బెంగళూరు
దుబాయ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కొరియర్ లో వచ్చిన డాక్యుమెంట్ ఫైల్స్ తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతే డాక్యూమెంట్ ఫైల్స్ లో ఏకంగా రూ. 5. 30 కోట్ల విలువైన డ్రగ్స్ ఉండటంతో కస్టమ్స్ అధికారులు, పోలీసు అధికారులు హడలిపోయారు.

టూత్ పేస్ట్, పౌండర్, సబ్బుల్లో డ్రగ్స్ ?
డాక్యూమెంట్ ఫేల్స్ తీసుకోవడానికి వెళ్లిన వ్యక్తికి అనుమాన వచ్చి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇటీవల విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు లగేజ్ లో టూత్ పేస్ట్, పౌడర్, సబ్బుల్లో డ్రగ్స్ తీసుకు వచ్చి బెంగళూరులో ఉంటున్న డ్రగ్స్ డీలర్లకు సరఫరా చేస్తున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి ప్రయాణికులు తీసుకువస్తున్న లగేజ్ లు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే వారిని ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications