Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త: రూ.1699కే ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్

జియోకు కౌంటర్‌గా కార్బన్‌ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసిన టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమైంది. లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ డివైజ

న్యూఢిల్లీ: జియోకు కౌంటర్‌గా కార్బన్‌ భాగస్వామ్యంలో ఏ40 4జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసిన టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు సిద్ధమైంది. లావాతో చేతులు కలిపి మరో 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ డివైజ్‌ను తీసుకొస్తున్నట్టు సమాచారం.

రిలయన్స్ జియోకు చెక్ పెట్టే ఉద్దేశ్యంతో ఈ రెండు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకొన్నట్టు ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఈ రెండింటి భాగస్వామ్యంలో మాత్రం 4జీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

Airtel and Lava may launch 4G smartphone at price of Rs 1,699 to fight JioPhone

కార్బన్‌ ఏ40 ఇండియన్‌తో పోలిస్తే కొన్ని స్పెషిఫికేషన్లు, ధరలో మాత్రమే తేడా ఉంటుంది. . కార్బన్‌ ఏ40 ఇండియన్‌ మాదిరిగా భారీ మొత్తంలో డేటా, వాయిస్‌ ప్రయోజనాలతోనే ఈ ఎయిర్‌టెల్‌-లావా ఫోన్‌‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని ధర రూ.1,699గా ఉంది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఖరీదు 1,399 రూపాయలు.

లావా ఫోన్‌ వ్యూహం కూడా కార్బన్‌ ఏ40 ఇండియన్‌ మాదిరే. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి తొలుత వినియోగదారులు రూ.3,500 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కంపెనీ రూ.1,801ను క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుంది. అంటే ఎయిర్‌టెల్‌-లావా ఫోన్‌ అందుబాటులోకి వచ్చేది 1,699 రూపాయలకే. అయితే రూ.1,801ను కంపెనీ ఎలా రీఫండ్‌ చేస్తుందోననే విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు.

4.5 అంగుళాల లేదా 5 అంగుళాల డిస్‌ప్లేను ఈ ఫోన్‌ కలిగి ఉండబోతుందని మాత్రమే తెలిసింది. అయితే ఇటు ఎయిర్‌టెల్‌ కానీ, అటు లావా కానీ ఈ డివైజ్‌పై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+