వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు షాక్: 3 నెలలకు 30 జీబీ ఉచిత డేటా, ఉచిత రోమింగ్ ప్రకటించిన ఎయిర్ టెల్

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ రిలయన్స్ నుండి వచ్చే పోటీని తట్టుకొనేందుకుగాను ఉచిత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ రిలయన్స్ నుండి వచ్చే పోటీని తట్టుకొనేందుకుగాను ఉచిత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

ఆరుమాసాల పాటు ఉచితంగా వాయిస్ కాల్స్ ను, ఉచితంగా డేటాను అందించింది రిలయన్స్ జియో. అయితే ఆరు మాసాలపాటు ఉచిత సేవలను అందించిన రిలయన్స్ జియో ఏప్రిల్ నుండి తమ కస్టమర్ల నుండి డబ్బులను వసూలు చేయనుంది.

రిలయన్స్ జియో కారణంగా ఇతర టెలికం కంపెనీలు కూడ ఉచిత ఆఫర్లతో హోరెత్తిస్తున్నాయి. తమ టారిఫ్ రేట్లలో కూడ మార్పులు చేశాయి.రిలయన్స్ జియో తరహాలోనే కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి టెలికం కంపెనీలు.

అయితే ప్రత్యర్థి టెలికం కంపెనీలు ప్రకటిస్తున్న ఆఫర్ల కంటే రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో చుక్కలు చూపిస్తోంది.దీంతో ఇతర టెలికం కంపెనీలు కూడ కొత్త కొత్త ఆఫర్లను తీసుకువస్తున్నాయి.

10 జీబీ ఎయిర్ టెల్ ఉచిత డేటా

10 జీబీ ఎయిర్ టెల్ ఉచిత డేటా

రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్ మరో ఉచిత ఆఫర్ ను ముందుకు తెచ్చింది. రిలయన్స్ అద్భుత ఆఫర్లతో కస్టమర్లను పెంచుకొంటూపోతోంది.అయితే ఎయిర్ టెల్ తన కస్టమర్లకు 10 జీబీ ఉచిత డేటాను ప్రకటించింది.మూడు మాసాల పాటు ఉచితంగా 30 జీబీని అందించనున్నట్టు ప్రకటించింది.

ఉచిత డేటా పొందండిలా

ఉచిత డేటా పొందండిలా

ఏప్రిల్ 30వ, తేది నాటికి మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా లాగిన్ అయిన పోస్ట్ పెయిడ్ చందాదారులకు ప్రతి నెల 10 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

మూడు మాసాల పాటు 30 జీబీని ఉచితంగా ఇవ్వనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. వేసవికాలం సుదీర్ఘ వెకేషన్ ను ఎంచుకొన్నవారికి ఇది అత్యంత అనుకూలంగా ఉంటుందని ఎయిర్ టెల్ ప్రతినిధులు చెప్పారు.

విదేశాలకు వెళ్ళేవారికి ఉచిత రోమింగ్

విదేశాలకు వెళ్ళేవారికి ఉచిత రోమింగ్

మరో వైపు విదేశాలకు వెళ్ళేవారికి కూడ ఉచిత రోమింగ్ సౌకర్యాలను కల్పించనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది. విదేశాలకు వెళ్ళే ముందు ఈ ప్యాకేజీని తీసుకోకపోయినా కాని, తమ కస్టమర్ల కోసం ఎయిర్ టెల్ మరో సౌకర్యాన్ని ప్రకటించింది.

ప్రతిరోజూ రూ.499 కంటే ఎక్కువ వాడితే ఆటోమెటిక్ గా ఉచిత రోమింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది.అయితే దీనిలో ఉచిత ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్, డేటాను ఇవ్వనున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించింది.

జియో దెబ్బకు ప్లాన్ మార్చిన ఎయిర్ టెల్

జియో దెబ్బకు ప్లాన్ మార్చిన ఎయిర్ టెల్

ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో దేశంలో సుమారు 72 మిలియన్ కస్టమర్లను చేరుకొంది.అయితే ఒకప్పుడు దేశంలో ఎయిర్ టెట్ అగ్రగామిగా వెలుగొందింది.

అయితే రిలయన్స్ ఇస్తోన్న ఆఫర్లతో ఎయిర్ టెల్ కూడ ఉచిత ఆఫర్లతో తన వ్యూహన్ని మార్చుకొంది.లేకపోతే మార్కెట్లో నిలదొక్కుకొనే పరిస్థితి లేకుండా పోయింది. అయితే రిలయన్స్ జియో ప్రవేశంతో కస్టమర్లకు మంచిరోజులు వచ్చాయి. టెలికం కంపెనీల మధ్య పోటీ కారణంగా కస్టమర్లకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం లభించింది.

English summary
Mobile operator Bharti Airtel is handing out free high-speed data to its postpaid subscribers for the next three months to counter aggressive offerings by newcomer Reliance Jio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X