వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజిత్ ఎఫెక్ట్: శరద్ పవార్ ను నమ్మని కాంగ్రెస్: ఇక ఎన్సీపీతో తెగదెంపులేనా..!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో బీజేపీ వేసిన ఎత్తులతో కాంగ్రెస్...శివసేన చిత్తయ్యాయి. అజిత్ పవార్ బీజేపికి మద్దతివ్వటంలో తన పాత్ర లేదని శరద్ పవార్ స్పష్టం చేసారు. ఇది పార్టీ నిర్ణయం కాదని..అజిత్ పవార్ సొంతంగా తీసుకున్న నిర్ణయమని చెబుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం అజిత్ పవార్ తమ పార్టీ నుండి గెలిచిన 54 మంది ఎమ్మెల్యే మద్దతు తమకు ఇస్తున్నట్లుగా లేఖ ఇచ్చారని కొత్త అంశం తెర మీదకు తెచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు మాత్రం ఎన్సీపీ డబుల్ గేమ్ అడిందంటూ ఆరోపిస్తోంది. శరద్ పవార్ చెబుతున్న మాటలను విశ్వాసంలోకి తీసుకుంటున్నట్లుగా కనిపించటం లేదు. ఎన్సీపీ నమ్మక ద్రోహం చేసిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్..ఇప్పుడు శరద్ పవార్ పైన పరోక్షంగా ప్రతికూల వ్యాఖ్యలు చేస్తోంది. ఎన్సీపీ విశ్వాసఘాతానికి పాల్పడిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తన్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో..ఇక, కాంగ్రెస్ .. ఎన్సీపీ మధ్య పొత్తు పైన నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. తెగ దెంపులు తప్పవనే విధంగా సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఫడ్నవీస్ కు ఈనెల 30 డెడ్ లైన్: బలపరీక్షకు కొత్త వ్యూహాలు: సేన..ఎన్సీపీ చీలికపైనే ఆధారం..!ఫడ్నవీస్ కు ఈనెల 30 డెడ్ లైన్: బలపరీక్షకు కొత్త వ్యూహాలు: సేన..ఎన్సీపీ చీలికపైనే ఆధారం..!

మండిపడుతున్న కాంగ్రెస్..

మండిపడుతున్న కాంగ్రెస్..

మహారాష్ట్రలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల మీద కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జోక్యంతోనే తాము శివసేనకు మద్దతిచ్చేందుకు మందుకు వచ్చిన విషయాన్ని కాంగ్రెస గుర్తు చేస్తోంది. అయితే, ఇప్పుడు ఎన్సీపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఆరోపిస్తోంది. పరోక్షంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్సీపీ విశ్వాస ఘాతుకానికి పాల్పడిందంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత పరిణామాల పైన కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఇదంతా నిజంగా అజిత్ పవార్ పార్టీని కాదని..సొంతంగా తీసుకున్న నిర్ణయమా..లేక బీజేపీ దర్శకత్వంలో ఎన్సీపీ నాయకత్వం డబుల్ గేమ్ అడుతోందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. అయితే, తమను ముగ్గులోకి లాగి..ఇప్పుడు ఎన్సీపీ రాజకీయం చేసందని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవతున్నారు.

 శరద్ పవర్ ను నమ్మటం లేదా..

శరద్ పవర్ ను నమ్మటం లేదా..

కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే..జరగిన మొత్తం వ్యవహారం శరద్ పవార్ కు తెలిసే జరిగిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పవార్ ను ఉద్దేశించి పార్టీ నేత అబిషేక్ మను సింఘ్వీ కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో పార్టీ మీద పూర్తి పట్టు ఉన్న శరద్ పవార్ ను కాదని అజిత్ పవార్ నిర్ణయం తీసుకుంటారా అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే, శరద్ పవార్ కుమార్తె కారణంగా పార్టీలో కుటుంబ పరమైన విబేధాలు ప్రభావం చూపాయని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో పవార్ కుటుంబం..ఎన్సీపీ చీలిపోయిందంటూ ఎంపీ సుప్రియా సూలే చేసిన కామెంట్ సైతం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది.ఆ విభేదాలనే బీజేపీ తమకు అనుకూలగా మలచుకున్నట్లుగా కనిపిస్తోది. దీని ద్వారా..ఇప్పుడు శివసేన ఒంటరి అవ్వటమే కాకుండా.. ఎన్సీపీ..కాంగ్రెస్ మధ్య సైతం పొత్తు కు బీటలు వారే అవకాశం కనిపిస్తోంది.

 ఎన్సీపీతో కాంగ్రెస్ తెగ దెంపులు చేసుకుంటుందా..

ఎన్సీపీతో కాంగ్రెస్ తెగ దెంపులు చేసుకుంటుందా..

తాజా పరిణామాల పైన కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తం వ్యవహారంలో ఎన్సీపీ గేమ్ ఆడిందని..బీజేపీ కనుసన్నల్లో నడించదనేది వారి అనుమానం. ఎన్సీపీ గురించి పార్లమెంట్ లో ప్రధాని మోదీ ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయటం..ఆ తరువాత శరద్ పవార్ నేరుగా ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ అవ్వటంతోనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక, ఇప్పుడు ఏకంగా తాము ఎన్సీపీ జోక్యంతోనే శివసేనకు మద్దతిచ్చేందుకు ముందుకు వస్తే..చివరి నిమిషంలో రాజకీయంగా బీజేపీ పై చేయి సాధించే విధంగా ఎన్సీపీ సహకరించిందనేది వారి అభిప్రాయం. సోనియాతో విభేదించి ఎన్సీపీ ఏర్పాటు చేసిన శరద్ పవార్ తో తరువాతి కాలంలో పొత్తు రాజకీయాలు చేసిన కాంగ్రెస్..తిరిగి ఇప్పుడు ఆ పార్టీతో రాజకీయ పొత్తు కొనసాగించాలా లేదా అనే మీమాసంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే, ఇప్పటి కిప్పుడు నిర్ణయం తీసుకోకుండా.. జరుగుతున్న పరిణామాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

English summary
After Ajit Pawar gave a shock to NCP and congress and joined hands with BJP, Congress is now seemed to have lost faith in SharadPawar. Sources say that the grand old party Congress is in a plan to bid goodbye to NCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X