అఖిలేష్, పూనమ్ సిన్హా నామినేషన్ పత్రాలు దాఖలు: రాజ్ నాథ్ సింగ్ పై షాట్ గన్ భార్య పోటీ!
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ మధ్యాహ్నం ఆయన మధ్యాహ్నం ఆయన మిత్రపక్షం బహుజన్ సమాజ్ వాది పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రాతో కలిసి ఆజంగఢ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.

రిటర్నింగ్ అధికారికగా వ్యవహరిస్తోన్న జిల్లా కలెెక్టర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆజంగఢ్ లో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ఆజంగఢ్ సమాజ్ వాది పార్టీకి కంచుకోట. ఇదివరకు అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్.. ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. కుమారుడి కోసం ఆయన తన స్థానాన్ని త్యాగం చేశారు. మైన్ పురి నుంచి ములాయం సింగ్ యాదవ్ ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇటీవలే సమాజ్ వాది పార్టీ తీర్థం పుచ్చుకున్న పూనమ్ సిన్హా ఇవ్వాళే నామినేషన్లను దాఖలు చేశారు. ఆ సమయంలో ఆమె భర్త, బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఉన్నారు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాజకీయాల్లో అరంగేట్రం చేసిన పూనమ్ సిన్హా.. తన తొలి పోటీలోనే గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆమె ఢీ కొట్టబోతున్నారు.

బీజేపీ అభ్యర్థిగా రాజ్ నాథ్ సింగ్ ఈ సారి కూడా లక్నో నుంచే పోటీ చేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ-రాష్ట్రీయ లోక్ దళ్ పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఎస్పీ-బీఎస్పీ కార్యకర్తలు, నాయకుల మద్దతుతో తాను రాజ్ నాథ్ సింగ్ ఓడించగలుగుతానని పూనమ్ సిన్హా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications