అఖిలేష్ చదువుకున్న మూర్ఖుడు : ఉమా భారతి ఫైర్
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అఖిలేష్ తీసుకున్న నిర్ణయాలను ప్రజా వ్యతిరేకమైన చర్యగా తప్పుబట్టిన ఆమె అఖిలేష్ ఓ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని, సీఎం అయినంత మాత్రాన అంత అహంకారం పనిచేయదని మండిపడ్డారు.
ఉమాభారతికి అంతలా ఆగ్రహం తెప్పించిన విషయమేంటంటే..! దేశంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలకు కేంద్రం రైళ్ళ ద్వారా నీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బుందేల్ ఖడ్ లో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా కేంద్రం రైలు ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే యూపీ మీదుగా నీటిని తీసుకుని వెళ్తున్న రైలును గురువారం ఝాన్సీలో స్టేషన్ లో నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు సీఎం అఖిలేష్.

అంతేకాదు, కేంద్రానికి ఈ విషయంలో జోక్యం అనవసరమంటూ కేంద్రానికి మంట పుట్టించేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో అఖిలేష్ చర్యపై స్పందించిన ఉమా భారతి అఖిలేష్ ను ఓ చదువుకున్న మూర్ఖుడిగా అభివర్ణించారు. ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు, ఆహారం వంటి వాటిపై కూడా రాజకీయం చేయాలని చూడడం సరికాదని, ఆ అవసరం తమకు లేదని తెలిపారు. ఏదేమైనా రాజకీయాల కోసం ప్రజలను బలి పశువులను చేయడం సరైంది కాదనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications