వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తు కారణాలు ఇవీ..: మోడీ చీపురు ఇచ్చారని ఎద్దేవా

కాంగ్రెసు, ఎస్పీ పొత్తుకు కారణాలు ఉన్నాయి. బిజెపిని ఎదుర్కోవడానికి అది అనివార్యంగా ఇరు పార్టీలు గుర్తించాయని చెప్పవచ్చు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో: కాంగ్రెసు, ఎస్పీ పొత్తుకు కారణాలు ఉన్నాయి. బిజెపిని ఎదుర్కోవడానికి అది అనివార్యంగా ఇరు పార్టీలు గుర్తించాయని చెప్పవచ్చు. పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న బిజెపి, ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నది. మోడీ హవాను ఎదుర్కోవాలంటే ఉమ్మడిగా ముందుకు సాగడంతోనే సాధ్యమన్న వాస్తవాన్ని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) గుర్తించాయి.

- సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నేతలు పరస్పరం వాగ్భాణాలు సంధించుకున్నా.. పొత్తు పట్ల వాస్తవిక ద్రుక్పథం కనబరిచారు.

- ఒకానొక దశలో ఎస్పీ సీనియర్ నేత నరేశ్ అగర్వాల్.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అవకాశాలు చేజారిపోయాయని, ఆ పార్టీ మంకు పట్టుదలే ప్రతిష్ఠంభనకు కారణమని నిందించారు.

- యూపీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ ఎన్నికల పొత్తుపై సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ కలయిక సత్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. విజయం సాధించిన వారం లోగా రెండు పార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటిస్తాయన్నారు.

- దేశ ఐక్యత కోసం, భారత్ సమగ్రత కోసం, లౌకిక వాద సిద్ధాంతాల పరిరక్షణకు, మతతత్వ బిజెపిని అడ్డుకునేందుకు తాము పొత్తు పెట్టుకున్నామని ఎస్పీ యూపీశాఖ అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ చెప్పారు.

- బిజెపి విభజన రాజకీయాలకు చెక్ పెట్టేందుకు, లౌకికవాద సిద్ధాంతాలు, మతతత్వ, సామాజిక సామరస్యానికి ప్రోత్సాహం కల్పించేందుకు రెండు పార్టీల జట్టు కట్టాయి. సామాజిక న్యాయం, ప్రగతి, శాంతి, సానుకూల వాతావరణంతోపాటు రెండు పార్టీల సిద్ధాంతాలు ఒక్కటేనని ఎస్పీ, కాంగ్రెస్ నేతలు తెలిపారు.

- చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ జోక్యం వల్లే పొత్తు ఖరారైంది. పొత్తుపై చర్చలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనామకులను పంపడంపై యూపీ సిఎం అఖిలేశ్ యాదవ్ తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకించి కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను చర్చలకు పంపడమేమిటని తన అసంత్రుప్తిని బయటపెట్టారు.

చీపుర్లు ఇచ్చారని...

చీపుర్లు ఇచ్చారని...

పార్టీపై పూర్తిస్థాయి పట్టు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సిఎం అఖిలేశ్ యాదవ్ పూర్తిగా హుషారుగా ఉన్నారు. ఆదివారం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గత సార్వత్రిక ఎన్నికల్లో తమకు అధికారం అప్పగిస్తే ‘అచ్ఛే దిన్ (మంచిరోజులు) వస్తాయని పదేపదే ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోదీ.. ఆచరణలో మంచి రోజులు తేవడానికి బదులు స్వచ్ఛ భారత్ పేరిట ప్రజల చేతికి ఇచ్చారని అన్నారు

మోడీ యోగా పాఠాలు చెబుతున్నారు...

మోడీ యోగా పాఠాలు చెబుతున్నారు...

దీనికి తోడు మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని పాఠాలు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రధాని తీసుకొస్తామన్న అచ్ఛేదిన్ (మంచి రోజులు) కోసం ప్రజలంతా నిరాశగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. అసలు అచ్ఛేదిన్ అంటే నిజమైన నిర్వచనమేమిటో చెప్పాలని బిజెపిని డిమాండ్ చేశారు. బిజెపి పదేపదే చెప్తున్న ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్' నినాదానికి ఏమైందని నిలదీశారు.

పత్తర్ వాలీ కా సర్కార్

పత్తర్ వాలీ కా సర్కార్

గతంలో అధికారంలో ఉన్న బిఎస్పీ ప్రభుత్వం ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పత్తర్ వాలీ (బీఎస్పీ ఎన్నికల చిహ్నం ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేయడం) మినహా ఎటువంటి ప్రగతి సాధించలేదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే భారీగా, ఎత్తైన ఏనుగు విగ్రహాలను మాత్రమే ఏర్పాటుచేస్తుందని ఎద్దేవాచేశారు.

ఉచిత ప్రచారం మాకు గర్వకారణం...

ఉచిత ప్రచారం మాకు గర్వకారణం...

దీనిపై బీఎస్పీ అధినేత మాయావతి కూడా ధీటుగానే స్పందించారు. అఖిలేశ్ యాదవ్ విడుదలచేసిన ఎన్నికల మ్యానిఫెస్టోను కొట్టి పారేశారు. కోల్పోతున్న ప్రజాదరణను కాపాడుకోవడంతోపాటు సామాన్యులను మోసగించేందుకే మ్యానిఫెస్టో విడుదల చేశారన్నారు. తమ పార్టీ ఎన్నికల గుర్తుకు యూపీ సిఎం అఖిలేశ్ యాదవ్ ఉచితంగా ప్రచారం చేయడం తమకు గర్వ కారణమని మాయావతి అభివర్ణించారు. కళంకిత ముద్రతోపాటు అవినీతి పరుడైన, నేర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్న అధినేతకు మళ్లీ అధికారం అప్పగించొద్దని ఓటర్లను మాయావతి అభ్యర్థించారు.

ములాయం సోదరులు డుమ్మా...

ములాయం సోదరులు డుమ్మా...

ఎస్పీ వ్యవస్థాపకుడిగా ములాయం సింగ్ యాదవ్ ఆదివారం యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయనతోపాటు నేతాజీ సోదరులు శివ్ పాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్ కూడా గైర్హాజరయ్యారు. అయితే పార్టీపై పట్టుకోసం తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ నివారణకు నిరంతరం ప్రయత్నించిన సీనియర్ మంత్రి ఆజంఖాన్.. మళ్లీ తండ్రీ కొడుకులను కలిపేందుకు పూనుకున్నారు. మ్యానిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆజంఖాన్.. నేరుగా ములాయం నివాసానికి చేరుకుని ఆయనను ఒప్పించి వేదిక వద్దకు తీసుకొచ్చే సరికి అఖిలేశ్ మీడియా సమావేశం ముగిసింది. తన రాక ఆలస్యానికి కారణం ట్రాఫిక్ జామ్ అని నేతాజీ దాటేశారు.

మ్యానిఫెస్టో విడుదల...

మ్యానిఫెస్టో విడుదల...

తండ్రి ములాయం, బాబాయ్ శివ్ పాల్, గురువు - మరో బాబాయి రాంగోపాల్ యాదవ్ తదితర కుటుంబ సభ్యుల గైర్హాజరీలోనే యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎన్నికల మ్యానిఫెస్టో ఆవిష్కరించారు. తన సతీమణి, కన్నౌజ్ ఎంపి డింపుల్ యాదవ్, పార్టీ సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రాష్ట్ర సిఎం తెలియకపోవడం...

రాష్ట్ర సిఎం తెలియకపోవడం...

తాను ఒకసారి రాయబరేలీలోని ఒక పాఠశాలకు వెళ్లినప్పుడు విద్యార్థులంతా తనను చూసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని పొరపడ్డారని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ చెప్పారు. తమ రాష్ట్రంలోని విద్యార్థులకు తమ సొంత సీఎం ఎవరో తెలియకపోవడం షాక్ అని వ్యాఖ్యానించారు. స్కూల్ కు తాను వెళ్లినప్పుడు ఏడెనిమిది మంది మాత్రమే ఉన్నారన్నారు. వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడానని చెప్పారు. తానెవ్వరో చెప్పాలని ప్రశ్నిస్తే.. అవును మీరు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కదా? అని అన్నారని, దీంతో దిగ్ర్భాంతికి గురి కావడం తన వంతైందన్నారు అఖిలేశ్ యాదవ్. రాయబరేలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కంచుకోట. గాంధీ కుటుంబానికి ప్రాతినిధ్యం కల్పిస్తున్న నియోజకవర్గం. రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు దాదాపు ఖరారైన వెంటనే అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

English summary
Akhilesh Yadav releases Samajwadi Party manifesto; Mulayam, Shivpal give a miss
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X