యూపీ పోలింగ్ కు సర్వం సిద్దం - అందరి చూపు కర్హల్‌ వైపే : ఆ రెండు పార్టీలకూ..!!

దేశ వ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వైపే ఉంది. అందునా...రేపు ( ఆదివారం) జరిగే మూడో దశ పోలింగ్ యూపీ పాలిటిక్స్ లో డిసైడింగ్ ప్యాక్టర్. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. రెండు విడతల ఫలితాల పైన అటు ఎస్పీ..ఇటు బీజేపీ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మొత్తం ఏడు విడతలు పోలింగ్ జరగనుంది. మూడో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. యూపీలో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరుగుతుండగా ఆదివారం మూడో దశ జరగనుంది.

అఖిలేష్ పోటీ చేస్తున్న స్థానంలో సైతం

అఖిలేష్ పోటీ చేస్తున్న స్థానంలో సైతం

ఉత్తరప్రదేశ్‌లో మూడో దశలో 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.15 కోట్ల మంది ఓటర్లు వీరి భవిష్యత్తును నిర్దేశించనున్నారు. మూడో దశలో భాగంగా ఎన్నికలు జరుగుతున్న మొత్తం 16 జిల్లాల్లోని 29 స్థానాల్లో యాదవ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ పోటీ చేస్తున్న కర్హల్ నియోజకవర్గం సైతం ఇందులోనే ఉంది. అఖిలేష్ పోటీ చేయటం ద్వారా ఆ మొత్తం నియోజకవర్గాల మీద సామాజిక ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అఖిలేశ్‌ బాబాయ్‌ శివపాల్‌ సింగ్‌ గతంలో తాను 5 సార్లు గెలిచిన జశ్వంత్ నగర్‌ స్థానం నుంచి మరో సారి పోటీ చేస్తున్నారు.

2017లో ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు

2017లో ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు

2017 ఎన్నికల్లో ఈ మూడో విడత పోలింగ్ జరగనున్న 59 స్థానాల్లో బీజేపీ 49 స్థానాలను గెలుచుకుంది. సమాజ్ వాదీ 9 స్థానాలకు పరిమితం కాగా, కాంగ్రెస్ ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. అయితే..అయిదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత కొంత మేర ఇక్కడ ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే విధంగా మూడు సాగు చట్టాల పైన రైతుల ఆగ్రహం... యాదవ్‌ సామాజిక వర్గం సానుకూలత, ముస్లిం ఓటర్ల మద్దతుతో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామనే ధీమా సమాజ్ వాదీ నేతల్లో కనిపిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ సైతం తమ పాజిటివ్ ఓటుతో అధిక సీట్లు గెలుచుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ అయిదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు తమకు కలిసి వస్తాయని నమ్ముతోంది.

ఎస్పీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ

ఎస్పీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ

ప్రధానంగా శాంతి భద్రతల నిర్వహణలో యోగీ సర్కార కఠినంగా వ్యవహరించటంతో పాటుగా అయోధ్య, కాశీ క్షేత్రాల అభివృద్ధి వంటి పరిణామాలు కలిసి వస్తాయని కాషాయ శిబిరం అంచనాల్లో ఉంది. ఇక, ప్రధాని మోదీ... సీఎం యోగీల ఇమేజ్ సైతం కలిసి వస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఇక, ఇంటింటి ప్రచారంలో బీజేపీ నేతలు ముందున్నారు. మూడో దశ లో ఎస్పీ ప్రాబల్యం ఉంటుందని అంచనా వేసిన ప్రాంతాల్లో హోం మంత్రి అమిత్ షా.. సీఎం యోగీ ప్రత్యేకంగా తమ వ్యూహాలను అమలు చేసారు. దీంతో..ఓటర్ల తీర్పు ఎలా ఉందనేది వచ్చే నెల 10వ తేదీన వెల్లడి అయినా.. రేపటి పోలింగ్ సరళి ద్వారా ఒక అంచనా వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+