నోట్లు రద్దు: టోల్ ట్యాక్స్ వద్దు: పండగే పండగ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి రూ. 500, రూ.1,000 నోట్లు రద్దు చేసిన తరువాత దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాల దగ్గర గొడవలు మొదలైనాయి. రూ. 500, రూ. 1,000 నోట్లను వాహన దారులు ఇవ్వడంతో టోల్ ప్లాజా నిర్వహకులు వాటిని తీసుకోవడానికి నిరాకరించారు.

దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురైయ్యింది. రూ. 500, రూ.1,000 నోట్లు ఇచ్చిన వారికి చిల్లర్లు ఇవ్వడం వీలుకాకపోవడంతో టోల్ ప్లాజా నిర్వహకులు సైతం చేతులు ఎత్తేసి వారితో గొడవకు దిగుతున్నారు.
విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై చర్చించింది. ఈనెల 11వ తేది శుక్రవారం అర్దరాత్రి వరకు దేశంలోని అన్ని టోల్ ప్లాజాల్లొ వాహనదారులు టోల్ ట్యాక్స్ కట్టరాదని, తాము ఈ ట్యాక్స్ ను రద్దు చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications