అయ్య బాబోయ్.. రాత్రికి రాత్రే సెలబ్రిటీని చేసారుగా..! సిగ్గులు వలకబోస్తున్న పోలింగ్ అధికారి రీనా
లక్నో/హైదరాబాద్ : ఒక్క ఫొటోతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ అధికారి రీనా ద్వివేది తన వల్ల పోలింగ్ శాతం పెరిగిందనే వాదనను తోసిపుచ్చారు. లక్నోలో ప్రజా పన్నుల విభాగంలో పనిచేస్తున్న రీనా.. ఐదో విడత పోలింగ్ విధులకు ఈవీఎం బాక్స్‌ను చేతిలో పెట్టుకొని వెళ్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె నృత్యం చేస్తున్న కొన్ని వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే దీనిపై రీనా ద్వివేది స్పందిస్తూ.. నేనేమీ సెలబ్రిటీని కాదు సాధారణ మహిళనే. గతంలో రెండుసార్లు ఎన్నికల విధులకు హాజరయ్యాను. ఎంతో ఉత్సాహంగా పనిచేశాను. అప్పుడు కూడా నా ఫొటో వాట్సాప్‌లో వచ్చింది. కానీ, ఇప్పట్లా.. సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ కాలేదు. అయితే, ఒక పోలింగ్ కేంద్రంలో ఎంత ఓటింగ్ నమోదవుతుందనేది.. అక్కడి ప్రజల్లో ఉన్న చైతన్యంపైనే ఆధారపడి ఉంటుంది. అంతేగానీ పసుపు రంగు చీరనో.. నీలిరంగు చీరనో కట్టుకొని వస్తే ఓటింగ్ పెరగదు. నేను పనిచేసిన పోలింగ్ కేంద్రంలో దాదాపు 70శాతం పోలింగ్ నమోదైందని వివరించారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications