కుంభమేళా భక్తులకు అమెజాన్ సాయం-డెలివరీ బాక్సుల్ని ఇలా మార్చి..!
ఉత్తర్ ప్రదేశ్ లో మహాకుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రతీ పుష్కర కాలానికోసారి 45 రోజుల పాటు జరిగే ఈ అరుదైన మేళాకు దేశ విదేశాలకు చెందిన కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. వీరి కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్రం, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా అవి భక్తులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో అక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా రంగంలోకి దిగింది.
కుంభమేళాకు తరలివస్తున్న భక్తుల కోసం అమెజాన్ ఇండియా ఉచితంగా ఓ సాయం చేస్తోంది. అది తమ డెలివరీ బాక్సుల్ని మంచాలుగా మార్చి భక్తులకు వసతి సౌకర్యం అందిస్తోంది. "ఆప్కీ సువిధ కే లియే, ఆరాంకి డెలివరీ ( మీ సౌకర్యం కోసం సౌకర్యవంతమైన డెలివరీ) అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. మహా కుంభమేళాతో తమ అనుబంధాన్ని చాటుకునేందుకు ఇదో మంచి అవకాశమని అమెజాన్ ఇండియా చెబుతోంది.

ఏడాది పొడవునా తమతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న వినియోగదారులకు కుంభమేళాలో తమ డెలివరీ బాక్సుల్ని వారికి మంచాలుగా మార్చి ఇస్తున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ఇది ఓ విన్నూత్నమైన ఆలోచన మాత్రమే కాదని ఓ ప్రత్యేక ఏర్పాటు కూడా అని అమెజాన్ చెబుతోంది. ఈ అప్‌సైకిల్ బెడ్‌లు ఎటువంటి ఖర్చు లేకుండా అందిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి ప్రగ్యా శర్మ తెలిపారు. తద్వారా వాటిని భారీ సంఖ్యలో హాజరవుతన్న భక్తులు వాడుకునే వీలు ఉంటుందని వెల్లడించారు.
స్థానికంగా కుంభమేళా ఏర్పాట్లలో పనిచేస్తున్న అధికారులతో సమన్వయం ద్వారా వీటిని భక్తులకు అందిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications