అమెరికా,చైనాకు బిగ్ షాక్.. పాకిస్థాన్ భస్మమే.. భారత్ 'AMCA యుద్ధవిమానం' వచ్చేస్తోంది..!
భారత ఆయుధ సంపత్తిలో మరో కీలక ముందడుగు పడింది. పాకిస్థాన్, చైనాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎస్- 400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణులు కలిగి ఉంది భారత్. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది రక్షణశాఖ. ఐదోతరం యుద్ద విమానం తయారీకి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్(AMCA) గా పిలిచే ఈ ఐదోతరం యుద్ధ విమానాన్ని మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్.. స్ఫూర్తితో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించనున్నారు. ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ(ADA) పర్యవేక్షణలో ఈ ఐదో తరం యుద్ధ విమానం నిర్మాణం కానుంది. కొన్ని ప్రైవేట్ సంస్థలతో కలిసి రూపొందించనుంది. అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్(AMCA) విధానం ద్వారా భారత్ ఐదోతరం యుద్ధ విమానాలు కలిగిన దేశాల సరసన నిలువనుంది. భారత వాయు సేనకు మరింత బలం చేకూరనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్(AMCA) పనిచేయనుంది.

అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్(AMCA) ఐదోతరం యుద్ధ విమానాలను 2035 నాటికి డెలివరీ చేస్తామని డీఆర్డీఓ తెలిపింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నట్లు డీఆర్డీఓ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
“In a major push for #AatmanirbharBharat in defence, Raksha Mantri Shri @rajnathsingh has approved the Execution Model for the Advanced Medium Combat Aircraft (#AMCA) programme. The Aeronautical Development Agency (ADA) will lead the project in partnership with Indian industry.… pic.twitter.com/O4WrIXqBi5
— Press Trust of India (@PTI_News) May 27, 2025
ఈ ఐదోతరం యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీతో నిర్మితమవుతుంది. శత్రుదేశాల్లోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది. తొలిసారిగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను 'ఏరో ఇండియా-2025' సమ్మిట్ లో భారత్ ప్రపంచానికి చూపించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో దీన్ని రూపొందించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. 25 టన్నుల బరువు ఉండే ఈ విమానాన్ని మానవ రహితంగా(UAV) పనిచేసేలా తయారు చేస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.












Click it and Unblock the Notifications