అమెరికా లేడీపై ఢిల్లీ ఫైవ్ స్టార్ హోటల్లో గ్యాంగ్ రేప్

మహిళలపై దేశ రాజధాని ఢిల్లీలో అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా, ఓ అమెరికా మహిళపై ఐదుగురు వ్యక్తులు ఓ ఫైవ్ స్టార్ హోటల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై అత్యాచార పర్వం ఆగేట్లు లేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఓ అమెరికన్ టూరిస్టర్‌పై గ్యాంగ్‌రేప్ జరిగింది. టూరిస్ట్ గైడ్‌తో పాటు నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ ఆరోపించింది.

ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. టూరిస్ట్ వీసాతో తాను మార్చి 2016లో ఇండియాకు వచ్చానని, కొన్నాట్ పరిధిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉంటున్నానని ఆమె ఫిర్యాదులో చెప్పింది.

ఓ ఏజెన్సీని సంప్రదించగా టూరిస్ట్ గైడ్‌ను పంపించారని, అతను ఢిల్లీలోని కొన్ని పర్యాటక ప్రాంతాలను చూపించాడని తెలిపింది. తాను రూమ్‌లో ఒంటరిగా ఉండగా రూట్ ప్లాన్ గురించి మాట్లాడాలని గైడ్ వచ్చాడని, అతను అప్పటికే మద్యం సేవించి ఉన్నాడని ఆ పర్యాటకురాలు చెప్పింది.

American alleges rape by guide, 4 others in city 5-star

అతనితో పాటు మరో నలుగురు గదిలోకి వచ్చి డోర్ లాక్ చేశారని, ఆ తర్వాత తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తనపై అత్యాచారం జరగడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ మహిళ వెంటనే అమెరికా వెళ్లిపోయింది. ఈ సంఘటన గురించి తాను తన కుటుంబ సభ్యులకు చెప్పలేదని, అయితే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని ఆమె చెప్పింది.

ఆ తర్వాత తాను న్యాయవాదిని, తన మిత్రులను సంప్రదించానని, ఇండియాలోని ఎన్జీవోను సంప్రదించాల్సిందిగా వారు సలహా ఇచ్చారని, ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తనకు ఎన్జీవో ప్రతినిధులు సలహా ఇచ్చారని ఆమె వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+