సదానంద కొడుకుపై నటి రేప్ కేసు: అమిత్ షా ఆరా
న్యూఢిల్లీ/బెంగళూరు: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ పైన ఓ సిని నటి, మోడల్ మైత్రేయ తీవ్ర ఆరోపణలు చేసి, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీని పైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆరా తీశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని సదానందను ఆదేశించారు.
బుధవారం సదానంద తనయుడికి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో మైత్రేయ బెంగళూరులో మాట్లాడుతూ.. తనను కార్తీక్ గౌడ పెళ్లి చేసుకున్నాడని, తనను మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం జరుపుకుంటున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిని సదానంద కుట్రగా అభివర్ణించారు. తన కుమారుడు అలాంటి పనులు చేయడన్నారు. ఒకవేళ చేసినట్లు రుజువైతే శిక్షించవచ్చునన్నారు. తన పైన నమోదైన ఆరోపణలను కార్తీక్ కూడా ఖండించారు.
మరోవైపు, భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో డీఎంకే అధ్యక్షులు కరుణానిధి కుమారుడు, ఆ పార్టీ మాజీ నేత ఎంకే అళగిరిపై మధురై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో.. మధురైలో అళగిరికి చెందిన 'దయ ఇంజనీరింగ్ కాలేజ్' బయట 44 సెంట్ల భూమి ఉంది. దాన్ని నకిలీ పత్రాలతో కళాశాల వారు ఆక్రమించుకున్నారని ఆరోపించారని పోలీసులుతెలిపారు. అళగిరిని అరెస్టుచేసే అవకాశం ఉందంటున్నారు. అటు ఆయనపై చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించినవేనని సన్నిహితులు అంటున్నారు.

అమిత్ షా
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ పైన ఓ సిని నటి, మోడల్ మైత్రేయ తీవ్ర ఆరోపణలు చేసి, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీని పైన అమిత్ షా ఆరా తీశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని సదానందను ఆదేశించారు.

సదానంద గౌడ
బుధవారం సదానంద తనయుడికి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో మైత్రేయ బెంగళూరులో మాట్లాడుతూ.. తనను కార్తీక్ గౌడ పెళ్లి చేసుకున్నాడని, తనను మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం జరుపుకుంటున్నారని ఆరోపించారు.

సదానంద గౌడ
మైత్రేయ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిని సదానంద కుట్రగా అభివర్ణించారు. తన కుమారుడు అలాంటి పనులు చేయడన్నారు. ఒకవేళ చేసినట్లు రుజువైతే శిక్షించవచ్చునన్నారు. తన పైన నమోదైన ఆరోపణలను కార్తీక్ కూడా ఖండించారు.

సదానంద గౌడ
బుధవారం సదానంద తనయుడికి నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో మైత్రేయ బెంగళూరులో మాట్లాడుతూ.. తనను కార్తీక్ గౌడ పెళ్లి చేసుకున్నాడని, తనను మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం జరుపుకుంటున్నారని ఆరోపించారు. విచారిస్తున్న పోలీసుల దృశ్యం.

సదానంద గౌడ
మైత్రేయ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిని సదానంద కుట్రగా అభివర్ణించారు. తన కుమారుడు అలాంటి పనులు చేయడన్నారు. ఒకవేళ చేసినట్లు రుజువైతే శిక్షించవచ్చునన్నారు. తన పైన నమోదైన ఆరోపణలను కార్తీక్ కూడా ఖండించారు.

సదానంద గౌడ
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై అత్యాచారం, చీటింగ్ కింద బెంగళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.

సదానంద గౌడ
కార్తీక్‌తో తనకు వివాహం అయిందంటూ మైత్రేయ అనే కన్నడ నటి మైత్రేయ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు, ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించింది.

సదానంద గౌడ
ఈ ఏడాది మే 8వ తేదీన సదానంద కుమారుడు, తాను తొలిసారి ఒకరికొకరు పరిచయం అయ్యామని, తర్వాత మంచి స్నేహితులమయ్యామని తెలిపింది.

సదానంద గౌడ
ఆ తర్వాత తాము ప్రేమించుకోవడంతో జూన్ 5న కార్తీక్ తనను వివాహం కూడా చేసుకున్నట్లు చెప్పింది. కానీ, కార్తీక్ తనను మోసం చేశాడని ఆరోపించింది.

సదానంద గౌడ
కేంద్రమంత్రి సదానంద గౌడ కుటుంబం తనను కోడలిగా అంగీకరించాలని డిమాండ్ చేసింది. తాజాగా మంత్రి కుమారుడికి వేరే అమ్మాయితో కర్ణాటక కొడగు జిల్లాలోని కుషల్ నగర్‌లో నిశ్చితార్థం అయింది.

సదానంద గౌడ
ఈ నేపథ్యంలో మోడల్, నటి అయిన మైత్రేయ బయటకు వచ్చింది. అటు, ఈ వ్యవహారంపై మంత్రి సదానంద మాట్లాడుతూ.. దీనంతటి వెనుక ఏదో కుట్ర ఉందని, నేను చాలా బాధపడుతున్నానని అన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, అబద్ధమాడనని, ప్రజలను చీట్ చేయను. ఇలాంటి ఆరోపణలతో షాక్‌కు గురయ్యానని, వెంటనే తన కొడుకుతో మాట్లాడతానని, ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తోందని భావిస్తున్నానని, ఇందులో తనను బలిపశువును చేస్తున్నారన్నారు.

సదానంద గౌడ
మైత్రేయ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, తన తండ్రి చాలా బాధ్యతగల వ్యక్తని, అలాంటప్పుడు ఆయనకు మచ్చ తెచ్చేలా తానిలా ఎందుకు చేస్తానని సదానంద కుమారుడు కార్తీక్ అంటున్నాడు.












Click it and Unblock the Notifications