Reddy: గాలి జనార్దన్ రెడ్డి అడ్డాలో అమిత్ షా మీటింగ్, వాట్ నెక్ట్స్ ?, దెబ్బకు దెబ్బ తియ్యాలంటే ?
బీజేపీకి గుడ్ బాయ్ చెప్పి కొత్త రాజకీయ పార్టీ పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి అడ్డాలోనే అమిత్ షా బారీ బహిరంగ సభకు వేదిక సిద్దం అయ్యింది. గాలి జనార్దన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బీజేపీ బలమైన నాయకులను రంగంలోకి దింపుతోంది.
బెంగళూరు/బళ్లారి: ఈసారి మనం కచ్చితంగా అధికారంలోకి రావాలి. ఎవరు ఏం చేస్తారో మాకు తెలీదు, మీకు అప్పగించిన బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించాలి, ఇప్పుడు ఇక్కడ మనం అధికారంలోకి వస్తేనే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి మనం కేంద్రంలో అధికారంలోకి వస్తాము, ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన నాయకులకు టిక్కెట్లు దక్కకపోతే వారు రెబల్స్ గా మారకుండా, వేరే పార్టీలోకి జంప్ కాకుండా చూసుకునే బాధ్యత మీదే అని బీజేపీ హైకమాండ్ కర్ణాటకలోని బీజేపీ నాయకులు సూచించిందని తెలిసింది. ఇందులో భాగంగా అమిత్ షా టూర్ ఫిక్స్ అయ్యింది. బీజేపీకి గుడ్ బాయ్ చెప్పి కొత్త రాజకీయ పార్టీ పెట్టిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అడ్డాలోనే అమిత్ షా బారీ బహిరంగ సభకు వేదిక సిద్దం అయ్యింది. కర్ణాటకలో మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బల్లగుద్ది చెబుతున్నారు. జేడీఎస్ మాత్రం మేమే కింగ్ మేకర్స్ అంటున్నది. ఇక గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు వెయిట్ అండ్ సీ అంటోంది.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నిలు జరగనున్నాయి. ఎన్నికల కమీన్ డేట్ ఫిక్స్ చెయ్యడం ఆలస్యం, కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారనుకున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో రాజకీయాలు హీటెక్కిపోయాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, జేడీఎస్ తో పాటు కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ తమ సత్తా చాటుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఓటరు దేవుళ్లు ఎవరిని కరుణిస్తారు అని మాత్రం వేచిచూడాల్సిందే.

బీజేపీ హైకమాండ్
కర్ణాటక రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ నాయకులు కర్ణాటకలో పర్యటించడానికి పక్కాప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్ణాటకలో పర్యటించారు. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు ఆ రాస్ట్రంలోనే ఉండి అసెంబ్లీ ఎన్నికల విజయనాని శక్తివంచన లేకుండా పని చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా సూచించారని తెలిసింది.

అమిత్ షా ఎంట్రీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటనకు వేదిక సిద్దం అయ్యింది. బీజేపీ నుంచి వెళ్లిపోయి కొత్త రాజకీయ పార్టీ పెట్టిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అడ్డాలోనే అమిత్ షా బారీ బహిరంగ సభకు వేదిక సిద్దం అయ్యింది. ఈనెల 23వ తేదీన గురువారం సండూరులో అమిత్ షా బారీ బహిరంగ సభకు వేదిక సిద్దం అయ్యింది. ఇప్పటికే దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ నాయకులు అమిత్ షా బారీ బహిరంగ సభకు లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలను రప్పించడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

టార్గెట్ గాలి జనార్దన్ రెడ్డి ?
సండూరులో ఎలాగైనా బీజేపీ అభ్యర్థి విజయం సాధించాలని అమిత్ షా బహిరంగ సభను ఏర్పాటు చేశారని తెలిసింది. సండూరులో ఇంత వరకు బీజేపీ అభ్యర్థి ఎవరు అని ప్రకటించలేదు. దాదాపు 20 మంది ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సండూరులో మంచిపట్టు ఉంది. గాలి జనార్దన్ రెడ్డిని టార్గెట్ చేసి సండూరులో అమిత్ షా బారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని చర్చ జరుగుతోంది. అయితే మేము ఎవ్వరిని టార్గెట్ చెయ్యలేదని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.

దెబ్బకు దెబ్బ తియ్యాలంటే ఆయనే కరెక్ట్ ?
గురువారం సండూరులో జరిగే అమిత్ షా భారీ బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక మంత్రి బళ్లారి శ్రీరాములతో పాటు కేంద్ర మంత్రులు, కర్ణాటక మంత్రులు పాల్గొంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే ఇక్కడ బలమైన అభ్యర్థిని పోటీలో దింపాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డిని ఢీకొట్టడానికి ఆయన ప్రాణ స్నేహితుడు బళ్లారి శ్రీరాములును సండూరు నుంచి పోటీ చేపించాలని ఆలోచించి అమిత్ షాతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని తెలిసింది.

బళ్లారి, విజయనగర, రాయచూర్, కోప్పళ ?
అయితే సండూరులో కార్తికేయన్ అనే నాయకుడు ఎవరు పేరు చెబితే వారికి బీజేపీ హైకమాండ్ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సండూరులో పోటీ చెయ్యడానికి బళ్లారి శ్రీరాములు ఆసక్తి చూపిస్తారా ? లేదా అని వేచిచూడాలి. గురువారం మద్యాహ్నం సండూరులో భారీ బహిరంగ సభ పూర్తి అయిన తరువాత అమిత్ షా శివపుర ప్యాలెస్ లో బసచేస్తారు. శివపుర ప్యాలెస్ లో బళ్లారి, విజయనగర, రాయచూరు, కోప్పళ జిల్లాలకు చెందిన బీజేపీ కోర్ కమిటీ సమావేశవం జరగనుంది. ఇదే సమయంలో ఈ జిల్లాలకు చెందిన బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద అమిత్ షాతో గాలి జనార్దన్ రెడ్డికి చెక్ పెట్టడానికి రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications