తీవ్రవాదాన్ని ఏ మతంతోనూ లింక్ చేయొద్దు- అమిత్ షా కామెంట్స్-గుజరాత్ పోరు వేళ..
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఢిల్లీలోనూ రాజకీయ వ్యాఖ్యలు చేయిస్తున్నాయి. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ముచేసుకునేందుకు ఓవైపు కాంగ్రెస్, మరోవైపు ఆప్ పోటీపడుతున్న నేపథ్యంలో ముస్లింల ఓట్లు కూడా కీలకంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో తీవ్రవాదాన్ని ఏ మతంతోనూ లింక్ చేయకూడదని, చేయలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం చాలా ప్రమాదకరమని, దీని ముప్పు ఏ మతం లేదా గ్రూపుతో ముడిపడి ఉండదని అమిత్ షా తెలిపారు. హింసకు పాల్పడేందుకు, యువతను సమూలంగా మార్చేందుకు, ఆర్థిక వనరులను పెంపొందించేందుకు ఉగ్రవాదులు నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని, ఉగ్రవాదులు భయానక సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, వారి గుర్తింపులను దాచడానికి డార్క్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారని షా వెల్లడించారు.

ఢిల్లీలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన మూడవ 'ఉగ్రవాద నిరోధక ఫైనాన్సింగ్‌పై టెర్రర్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్'లో అమిత్ షా ప్రసంగించారు.తీవ్రవాద నిరోధక విభాగం భేటీలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. "ఉగ్రవాదం నిస్సందేహంగా, ప్రపంచ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పు. కానీ తీవ్రవాదం కంటే తీవ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం చాలా ప్రమాదకరమని నేను నమ్ముతున్నాను ఎందుకంటే తీవ్రవాదం యొక్క 'మార్గాలు మరియు పద్ధతులు' అటువంటి నిధుల నుండి పెంపొందించబడతాయి." అని షా అన్నారు.
ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని బలహీనం చేస్తుందని షా వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదం ముప్పు ఏ మతం, జాతీయత లేదా సమూహంతో ముడిపడి ఉండదని తాము గుర్తించినట్లు షా తెలిపారు.












Click it and Unblock the Notifications