చిక్కుల్లో అమితాబ్: టాక్స్ కేసు విచారణకు సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: ఇప్పటికే అక్రమంగా విదేశాల్లో నల్లధనం దాచుకున్నారన్న ఆరోపణలతో విమర్శల పాలైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్‌కు పన్ను ఎగవేత కేసులో మరోసారి చిక్కులు ఎదురవనున్నాయి. అమితాబ్‌పై 2001లో నమోదైన పన్ను ఎగవేత కేసును తిరిగి తెరిచేందుకు ఆదాయపుపన్ను శాఖకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
ఈ మేరకు న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 2001-02 సంవత్సరంలో అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' అనే క్విజ్ షో చేసిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా వచ్చిన ఆదాయంపై రూ.1.66కోట్ల వరకు పన్నును బిగ్‌బీ చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. దీనిపై 2001లో ఆయనపై కేసు నమోదైంది.
మరోవైపు బిగ్‌బీ ఆదాయంలో 30 శాతం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్టన్లు 2008లో బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. తనను కళాకారుడిగా పరిగణించి.. పన్ను మినహాయించాలని అమితాబ్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అంగీకరించింది. దాదాపు 11 ఏళ్లు సాగిన కేసును జూలై 2012లో బాంబే హైకోర్టు కొట్టి వేసింది.

సెక్షన్ 80ఆర్‌ఆర్ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం బిగ్‌బీకి పన్ను మినహాయింపు కల్పించింది. అయితే బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఐటీ శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అమితాబ్ యాంకర్‌గా చేశారని.. దాన్ని నటించడం అనలేరని ఐటీశాఖ తెలిపింది.
అంతేగాక.. విదేశాల్లో నటించడం లేదా.. తమ నటనకు విదేశీ ఏజెన్సీల నుంచి పారితోషికం తీసుకున్న నటులకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుందని ఐటీ శాఖ పేర్కొంది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. ఈ కేసులో విచారణను తిరిగి చేపట్టేందుకు ఐటీశాఖకు అనుమతినిచ్చింది.












Click it and Unblock the Notifications