వారి చావులకు కారణం మమతా బెనర్జీనే: అమిత్ షా

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనంద్ పూర్ లోని మోమో ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదానికి కారణం దీదీ సర్కార్ అని.. కార్మికుల మృతికి మమతా బెనర్జీనే కారణమని తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు నివాళులు అర్పించారు. ఈ ఘటన కేవలం ప్రమాదం కాదని రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు నిదర్శనం అని అన్నారు. ప్రస్తుతం బెంగాల్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమ బెంగాల్ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆనంద్‌ పూర్ మోమో ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదం కేవలం ప్రమాదం కాదని, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వల్ల జరిగింని అమిత్ షా అన్నారు. ఈ ప్రమాదానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియకు బెంగాల్ అధికారులు సహకరించడం లేదని అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడంలో బీజేపీ పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి సహకరిస్తుందని, అనర్హులైన ఓటర్లను తొలగించి జాబితాను ఫిల్టర్ చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ఈమేరకు ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

బెంగాల్‌ లోని టీ తోటల కార్మికుల దుస్థితిపైనా స్పందించారు. బెంగాల్ లోని టీఎంసీ ప్రభుత్వం వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటోందన్నారు. అసోం తరహాలోనే బెంగాల్‌ లోని టీ తోటల కార్మికులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఈ సందర్భంగా షా హామీ ఇచ్చారు. బెంగాల్ లో మమతా బెనర్జీ టీ తోటల కార్మికులకు కేవలం అగ్గిపెట్టె లాంటి చిన్న ఇళ్లను మాత్రమే ఇవ్వాలని చూస్తున్నారని.. కానీ బీజేపీ వారికి భూమిపై హక్కులను ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.

AmitShah Blasts Mamata Didi Govt s Corruption Behind Anandpur Momo Factory Fire That Killed Workers

'మా, మట్టి, మనుష' (అమ్మ, మట్టి, మనిషి) నినాదంతో అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ పాలనలో.. ప్రస్తుతం ఆ మూడూ ప్రమాదంలో పడ్డాయని అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. దేశ రక్షణ కోసం బెంగాల్‌ లో బీజేపీ జెండా ఎగరాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమిత్ షా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+