దేశద్రోహం! అమ్నెస్టీ ఆఫీసులు క్లొజ్
బెంగళూరు: అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ భారత్ లోని తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. తమ కార్యకలాపాలు మొత్తం వాయిదా వేస్తున్నామని అమ్నెస్టీ సంస్థ ప్రతినిధులు చెప్పారు.
బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, పూణే కార్యాలయాలను మూసివేశారు. స్వచ్చంద నిరసనకారులు ఈ సంస్థ మీద దేశద్రోహం చేశారని ఆరోపణలు చేస్తూ వరుసగా ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో అమ్నెస్టీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
కాశ్మీర్ అంశంపై అమ్నెస్టీ ఏర్పాటు చేసిన చర్చాగోష్టి కార్యక్రమం బెంగళూరులో జరిగింది. ఈ చర్చాగోష్టి కార్యక్రమంలో కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొందరు పోలీసులను ఆశ్రయించారు.

అమ్నెస్టీ సంస్థ మీద దేశద్రోహం కేసు పెట్టారు. అమ్నెస్టీ సంస్థ ఏర్పాటు చేసిన చర్చా గోస్టి కార్యక్రమంలో దేశద్రోహ నినాదాలు చేశారా? అని పోలీసులు విచారణ చేపట్టారు. అమ్నెస్టీ చర్చాగోస్టి కార్యక్రమానికి సంబంధించిన వీడియో టేపులు ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాము దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని, కాశ్మీర్ లోని బాధితులకు న్యాయం చేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అమ్నెస్టీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారని, సంస్థ ఉద్యోగులు ఎవ్వరూ పాల్గొనలేదని వారు అంటున్నారు.












Click it and Unblock the Notifications