శునకంపై అమానుషం.. వయాగ్రా వాడానంటూ నిందితుడి వింత వాదన!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాలో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. హసన్పూర్ కొత్వాలి పరిధిలో శకీల్ అలియాస్ పప్పు(50) అనే ముగ్గురు పిల్లల తండ్రి, ఓ ఆడ కుక్కపై అమానుషమైన చర్యకు పాల్పడ్డాడు. సమీపంలోని ఓ దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
షాప్ యజమాని ఈ వీడియోను తన స్నేహితులకు పంపగా.. అక్కడి నుంచి అది కాస్తా వైరల్ అయి స్థానిక యువకుడి వాట్సాప్‌కు చేరింది. ఆ యువకుడు వెంటనే సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందజేశాడు. ఆధారాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని శకీల్గా గుర్తించి.. అతడిపై జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు ఓ వింత వాదనను వినిపించాడు. తాను పురుషత్వ సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా టాబ్లెట్ వాడటం వల్ల ఆ ప్రభావంలోనే ఈ పని చేసినట్లు పోలీసులకు చెప్పాడు. అయితే నిందితుడి దారుణ చర్యను కప్పిపుచ్చేందుకు చెబుతున్న ఈ సాకును పోలీసులు తోసిపుచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌ను కీలక ఆధారంగా స్వాధీనం చేసుకుని నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టి కోర్టులో హాజరుపరిచినట్లు కొత్వాలి ఇన్ స్పెక్టర్ సత్యేంద్ర సరోహా తెలిపారు.












Click it and Unblock the Notifications
